1. {#1గోత్రాలు గూర్చి మోషే పలికిన దీవెనలు }
2. [PS]దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. [PE][PS]యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు [PE][QS]శేయీరు నుంచి వారికి ఉదయించాడు. [QE][QS]ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు [QE][QS]వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. [QE][QS]ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. [QE]
3. [QS]నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. [QE][QS]ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, [QE][QS]వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. [QE]
4. [QS]మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, [QE][QS]యాకోబు సమాజానికి అది వారసత్వం. [QE]
5. [QS]అప్పుడు ప్రజల అధికారులూ [QE][QS]ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే [QE][QS]యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. [QE]
6. [QS]రూబేను చావకూడదు. బతకాలి. [QE][QS]అయితే వారు కొద్ది మంది మాత్రమే. [QE]
7. [QS]యూదా గురించి మోషే ఇలా పలికాడు, [QE][QS]యెహోవా, యూదా ప్రజల మనవి విని, [QE][QS]మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. [QE][QS]అతని కోసం పోరాడు. [QE][QS]అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి [QE]
8. [QS]లేవీ గురించి మోషే ఇలా పలికాడు, [QE][QS]నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. [QE][QS]మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. [QE][QS]మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు. [QE]
9. [QS]నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, [QE][QS]తన తల్లి గురించి అన్నవాడు అతడు. [QE][QS]తన సోదరులను లెక్క చెయ్యలేదు. [QE][QS]తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. [QE][QS]ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. [QE][QS]నీ నిబంధన పాటించాడు. [QE]
10. [QS]అతడు యాకోబుకు నీ విధులనూ, [QE][QS]ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. [QE][QS]అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. [QE][QS]నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు. [QE]
11. [QS]యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, [QE][QS]అతడు చేసే పనులను అంగీకరించు. [QE][QS]అతనికి విరోధంగా లేచే వారి, [QE][QS]అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. [QE][QS]వాళ్ళు మళ్ళీ లేవరు. [QE]
12. [QS]బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, [QE][QS]యెహోవాకు ప్రియుడు. [QE][QS]ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. [QE][QS]రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. [QE][QS]అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. [QE]
13. [QS]యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. [QE][QS]యెహోవా అతని భూమిని దీవిస్తాడు [QE][QS]ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, [QE][QS]కింద ఉన్న జలాగాధంతో, [QE]
14. [QS]సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, [QE][QS]నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో, [QE]
15. [QS]పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, [QE][QS]శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో, [QE]
16. [QS]భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, [QE][QS]పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. [QE][QS]తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక. [QE]
17. [QS]తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. [QE][QS]అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. [QE][QS]వాటితో అతడు ప్రజలను [QE][QS]భూదిగంతాలకు తోలివేస్తాడు. [QE][QS]వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. [QE][QS]మనష్షేకు చెందిన వేలమంది. [QE]
18. [QS]జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, [QE][QS]జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. [QE][QS]ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. [QE]
19. [QS]వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. [QE][QS]అక్కడ సరైన బలులు అర్పిస్తారు. [QE][QS]వారు సముద్రాల సమృద్ధినీ [QE][QS]సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. [QE]
20. [QS]గాదు గురించి మోషే ఇలా పలికాడు. [QE][QS]గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. [QE][QS]ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది [QE][QS]చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. [QE]
21. [QS]అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. [QE][QS]నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. [QE][QS]ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, [QE][QS]యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. [QE][QS]ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. [QE]
22. [QS]దాను విషయం మోషే ఇలా పలికాడు, [QE][QS]దాను సింహపు పిల్ల వంటిది [QE][QS]అది బాషానునుంచి దూకుతుంది. [QE]
23. [QS]నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. [QE][QS]కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, [QE][QS]యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, [QE][QS]పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. [QE]
24. [QS]ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, [QE][QS]మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. [QE][QS]తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. [QE][QS]తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు [QE]
25. [QS]నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. [QE][QS]నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. [QE]
26. [QS]యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు [QE][QS]నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు [QE][QS]తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. [QE]
27. [QS]నిత్య దేవుడు నీకు ఆశ్రయం, [QE][QS]శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. [QE][QS]శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. [QE][QS]నాశనం చెయ్యి! అంటాడు. [QE]
28. [QS]ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. [QE][QS]యాకోబు [* యాకోబు నీటి ఊట ]నివాసం సురక్షితం. [QE][QS]ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో [QE][QS]అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. [QE]
29. [QS]ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! [QE][QS]యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? [QE][QS]ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, [QE][QS]ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. [QE][QS]నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు [QE][QS]నువ్వు వారి [† వీపులను ]ఎత్తయిన స్థలాలను తొక్కుతావు. [QE]