1. {#1కనాను నుండి అనేక జాతుల పారదోలడం }
2. [PS]“మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు. [PE][PS]తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు.
3. మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు.
4. ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు. [PE]
5. [PS]కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి.
6. మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు.
7. అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా.
8. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు. [PE]
9. [PS]కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.
10. ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు.
11. కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి. [PE]
12. [PS]మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు.
13. ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకల మందలను దీవిస్తాడు. [PE]
14. [PS]అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.
15. యెహోవా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి, మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరచి, మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు. [PE]
16.
17. [PS]మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులనూ మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు. వారి దేవుళ్ళను పూజింపకూడదు. ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది. [PE][PS]ఈ ప్రజలు మా కంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరనుకుంటారేమో. వారికి భయపడవద్దు.
18. మీ యెహోవా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు
19. మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహా శక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తాడు.
20. మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి [* తెగులు, అరిష్టం. ]పెద్ద కందిరీగలను పంపుతాడు. [PE]
21. [PS]కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.
22. మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీకు క్షేమకరం కాదు. [PE]
23. [PS]అయితే మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిని మీకప్పగించి వారిని నాశనం చేసేవరకూ వారిని కలవరానికి గురిచేస్తాడు.
24. ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ ఏ మనిషీ మీ ఎదుట నిలవలేడు.
25. వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం.
26. దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి.” [PE]