4. బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. దీప స్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలు వెలిగించాలి.
|
9. అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.
|
12. తరువాత అహరోనును, అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెంటబెట్టుకుని తీసుకువచ్చి నీళ్లతో స్నానం చేయించాలి.
|
13. అతనికి పవిత్ర వస్త్రాలు తొడిగి అతడు నాకు యాజకుడుగా సేవ జరిగించడానికి అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి. PEPS
|
15. వాళ్ళు కూడా నాకు యాజకులుగా ఉండేలా వాళ్ళ తండ్రిని అభిషేకించినట్టు వాళ్ళను అభిషేకించి ప్రతిష్టించు. వారి అభిషేకం తరతరాలకు నిత్యమూ నిలిచే యాజకత్వ చిహ్నంగా ఉంటుంది.” PEPS
|
18. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దైవ నివాస మందిరం నిలబెట్టి దాని దిమ్మలు వేసి, దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలు అమర్చి, స్తంభాలను నిలిపాడు.
|
20. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు.
|
24. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో మందిరానికి దక్షిణం వైపున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు.
|
30. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు దైవసన్నిధి గుడారానికి, హోమ పీఠానికి మధ్య గంగాళం ఉంచి శుభ్రపరచుకోవడానికి దానిలో నీళ్లు పోయించాడు.
|
32. వాళ్ళు యెహోవా గుడారం లోపలికి ప్రవేశించినప్పుడు, హోమపీఠం చెంతకు వచ్చినప్పుడు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు. PEPS
|
33. మోషే మందిరానికి, హోమపీఠానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. ఆవరణ ద్వారం తెర వేశాడు. ఈ విధంగా మోషే పని మొత్తం ముగించాడు. PS
|
34. {యెహోవా సన్నిధి మహిమ మేఘం} (సంఖ్యా 9:15-23) PS అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.
|
35. ఆ మేఘం యెహోవా సన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే యెహోవా సన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు. PEPS
|
37. ఆ మేఘం పైకి వెళ్ళకపోతే అది వెళ్ళే రోజు దాకా ప్రయాణం ఆపివేసే వాళ్ళు. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి. PEPS
|
38. ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది. PE
|