1. {#1దైవభక్తిలేని నాయకులకు శిక్ష }
2. [PS]ఆ తరువాత ఆత్మ నన్ను పైకి ఎత్తి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గరికి తీసుకు వచ్చాడు. ద్వారం దగ్గర వాకిట్లో ఇరవై ఐదు మంది నాకు కనిపించారు. వాళ్ళలో అజ్జూరు కొడుకు యజన్యా, బెనాయా కొడుకు పెలట్యా, ఇంకా ప్రజల నాయకులూ ఉన్నారు. [PE][PS]దేవుడు నాకిలా చెప్పాడు. “దురాలోచనలు చేస్తూ పట్టణంలో దుర్మార్గపు ఆలోచనలు చేసేది వీళ్ళే.
3. వాళ్ళిలా అంటున్నారు, ‘ఇల్లు కట్టడానికి ఇది సమయం కాదు. ఈ పట్టణం పాత్ర అయితే మనం దానిలో ఆహారం’
4. కాబట్టి వాళ్లకి విరోధంగా ప్రవచనం పలుకు. నరపుత్రుడా, ప్రవచించు.” [PE]
5. [PS]ఆ తరువాత యెహోవా ఆత్మ నా పైకి వచ్చాడు. ఆయన నాకిలా చెప్పాడు. “నువ్వు ఇలా చెప్పు, యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అలాగే ఆలోచిస్తున్నారు. మీ మనస్సుల్లోకి వచ్చే ఆలోచనలు నాకు తెలుసు.
6. ఈ పట్టణంలో మీ చేతుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెంచుతున్నారు. మీ వల్ల చనిపోయిన వాళ్ళతో పట్టణ వీధులు నిండిపోయాయి.
7. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు చంపి పట్టణంలో పడవేసిన శవాలే ఆహారం. ఈ పట్టణం వంట పాత్ర. కానీ మిమ్మల్ని మాత్రం పట్టణంలో ఉండకుండాా తీసివేస్తాను. [PE]
8.
9. [PS]మీరు కత్తికి భయపడుతున్నారు. కాబట్టి మీ పైకి కత్తినే పంపుతాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. [PE][PS]“నేను మిమ్మల్ని పట్టణంలో నుండి తీసివేస్తాను. మీకు శిక్ష విధిస్తాను. మిమ్మల్ని విదేశీయుల చేతులకు అప్పగిస్తాను.
10. మీరు కత్తి చేత కూలిపోతారు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. [PE]
11. [PS]ఈ పట్టణం మీకు వంటపాత్రగా ఉండదు. మీరు దానిలో ఆహారంగా ఉండరు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను.
12. అప్పుడు ఎవరి చట్టాలను అనుసరించి మీరు జీవించకుండా, ఎవరి శాసనాలను పాటించకుండా మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల శాసనాలను పాటించారో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.” [PE]
13.
14. [PS]నేను ఆ ప్రకారమే ప్రవచిస్తూ ఉండగా బెనాయా కొడుకైన పెలట్యా చచ్చిపోయాడు. దాంతో నేను సాష్టాంగపడి పెద్ద స్వరంతో “అయ్యో! ప్రభూ, యెహోవా, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళని సమూలంగా నాశనం చేస్తావా?” అన్నాను. [PE][PS]అప్పుడు యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నాడు.
15. “నీ సోదరులను గూర్చీ నీ గోత్రం వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు ప్రజలందరిని గూర్చీ యెరూషలేము పట్టణవాసులు ‘మీరంతా యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు. ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాధీనం చేశాడు’ అని చెప్తున్నారు.” [PE]
16. [PS]కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను”
17. కాబట్టి ఇలా చెప్పు “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. నేను ఇతర జనాల మధ్యలో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు చెదిరిపోయిన దేశాలనుండి మిమ్మల్ని నేను సమీకరిస్తాను. మీకు తిరిగి ఇశ్రాయేలు దేశాన్ని ఇస్తాను
18. వారు అక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ప్రతి అసహ్యమైన దాన్నీ నీచమైన దాన్నీ అక్కడనుండి తీసివేస్తారు. [PE]
19. [PS]వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను.
20. దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను.
21. అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.” ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. [PE]
22. [PS]అప్పుడు కెరూబులు తమ రెక్కలు చాపాయి. చక్రాలు వాటి పక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా ఉంది.
23. తరువాత యెహోవా మహిమ తేజస్సు పట్టణంలో నుండి పైకి వెళ్ళి తూర్పున ఉన్న పర్వతంపై నిలిచింది. [PE]
24. [PS]తరువాత దేవుని ఆత్మ నాకనుగ్రహించిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి కల్దీయ దేశంలోని బందీల దగ్గరికి చేర్చాడు. నేను చూసిన దర్శనం నన్ను విడిచి వెళ్ళింది.
25. అప్పుడు యెహోవా నాకు తెలియజేసిన సంగతులన్నిటినీ అక్కడి బందీలకు వివరించాను. [PE]