1. {#1పక్షి రాజు, ద్రాక్షావల్లి }
2. [PS]యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. [PE]
3. [PS]“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పొడుపు కథ వెయ్యి. ఒక ఉదాహరణ వారికి చెప్పు. [PE]
4. [PS]ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. [PE][PS]ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. [PE][PS]వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. [PE][PS]ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది. [PE]
5. [PS]అది ఆ చెట్టు లేత కొమ్మల చిగుళ్ళు తుంచి, వాటిని కనాను దేశానికి తీసుకు వెళ్ళింది. [PE][PS]అక్కడ వర్తకులుండే పట్టణంలో వాటిని నాటింది. [PE]
6. [PS]అది ఆ దేశంలో నుండి కొన్ని విత్తనాలు కూడా తీసుకు వెళ్ళింది. [PE][PS]విత్తనాలు నాటడానికి సిద్ధపరిచిన ఒక పొలంలో వాటిని నాటింది. [PE][PS]వాటిని నాటిన చోటికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. [PE]
7. [PS]అది మొలకలు వేసింది. పైకి పెరగకుండా భూమిపై ఎత్తు పెరగకుండానే విశాలమైన కొమ్మలతో నేలపై వ్యాపించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. [PE][PS]దాని కొమ్మలు ఆ డేగ వరకూ వ్యాపించాయి. దాని వేళ్ళు డేగ కింద వైపుకు వ్యాపించాయి. ఆ విధంగా ఆ ద్రాక్ష చెట్టు అనేక శాఖలతో వర్ధిల్లి కొత్తగా రెమ్మలు వేసింది. [PE]
8. [PS]పెద్ద రెక్కలూ, విస్తారమైన ఈకలూ ఉన్న ఇంకో గొప్ప డేగ ఉంది. [PE][PS]చూడండి! ఈ ద్రాక్ష చెట్టు తన వేళ్ళను ఈ డేగ వైపుకి మళ్ళించింది. [PE][PS]అది నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమి నుండి తన కొమ్మలను డేగ వైపుకి మళ్ళించింది. [PE]
9. [PS]దాన్ని ఒక పెద్ద నీటి చెరువు పక్కనే మంచి నేల్లో అనేక కొమ్మలు వేసి, ఫలించి, చక్కని ద్రాక్ష తీగె కావాలని నాటడం జరిగింది.” [PE]
10. [PS]ప్రజలను ఇలా అడుగు. “అది అభివృద్ధి చెందుతుందా? ప్రజలు దాని వేళ్ళను పీకివేసి దాని పళ్ళు కోసుకోరా? [PE][PS]అప్పుడది ఎండి పోవాల్సిందే గదా! దాని చిగుళ్ళు ఎండి పోయాక ఎంతమంది దాని కోసం శ్రమించినా దాని వేళ్ళు ఇక చిగురించవు. [PE]
11. [PS]ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.” [PE][PS]తరువాత యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
12. “తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు. [PE]
13. [PS]అతడు రాజు వంశస్థుల్లో ఒకణ్ణి తీసుకుపోయి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. అతనితో ఒట్టు పెట్టించాడు. రాజ్యం బలహీనం కావడం కోసం, అది మళ్ళీ కోలుకోకుండా ఉండటానికి దేశంలో ఉన్న బలవంతులను అతడు తీసుకు వెళ్లి పోయాడు.,
14. ఇప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటే దేశం నిలిచి ఉంటుంది. [PE]
15. [PS]కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?
16. నా ప్రాణం పైన ఒట్టు, ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. ఎవరితో చేసిన నిబంధనను అతడు భంగ పరిచాడో, ఏ రాజు దగ్గర ఒట్టు పెట్టాడో, ఏ రాజు తనని రాజుగా చేశాడో ఆ రాజు రాజ్యంలోనే అతడు చనిపోతాడు. అతడు బబులోను లోనే చనిపోతాడు! [PE]
17. [PS]బబులోను సైన్యాలు యుద్ధంలో ముట్టడికై ఉన్నత స్థలాలను కట్టినప్పుడు, ప్రజలను చంపడానికి ప్రాకారాలను ముట్టడి వేసినప్పుడు ఫరో, అతని బలమైన సైన్యం, అతడు యుద్ధానికి సమకూర్చిన మనుషులు యుద్ధంలో యెరూషలేము రాజును కాపాడలేవు.
18. ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.” [PE]
19. [PS]కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “అతడు తృణీకరించిన ప్రమాణం నాకు చేసింది కాదా! నా నిబంధనను అతడు భంగం చేశాడు కదా! కాబట్టి అతడి పైకి శిక్ష రప్పిస్తున్నాను.
20. నా వల అతనిపై విసురుతున్నాను. అతడు నా ఉచ్చులో చిక్కుకుంటాడు. రాజద్రోహం చేసినందుకూ, నాకు నమ్మకద్రోహం చేసినందుకూ అతనిపై శిక్ష అమలు పరచడానికి అతణ్ణి బబులోనుకి తీసుకు వెళ్తాను.
21. అతనితో ఉన్న సైన్యంలో తప్పించుకుని పారిపోయిన వాళ్ళందరూ ఖడ్గం చేత నిర్మూలం అవుతారు. మిగిలిన వాళ్ళు అన్ని వైపులకీ చెదిరిపోతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందని ప్రకటిస్తున్నాను.” [PE]
22. [PS]ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
23. అది శాఖలుగా విస్తరించి ఫలాన్ని ఇచ్చేలా నేను దాన్ని ఇశ్రాయేలు పర్వతాల పైన నాటుతాను. అది ఎంతో ఘనమైన దేవదారు వృక్షం అవుతుంది. దాని కింద రెక్కలున్న పక్షులన్నీ నివసిస్తాయి. దాని కొమ్మల నీడలో అవి తమ గూళ్ళు కట్టుకుని పిల్లలను పెడతాయి. [PE]
24. [PS]అప్పుడు భూమిపైన చెట్లన్నీ నేనే యెహోవాను అని తెలుసుకుంటాయి. గొప్ప చెట్లను నేను కిందకు లాగుతాను. హీనమైన చెట్లను పైకి లేపుతాను. పచ్చని చెట్టు ఎండిపోయేలా చేస్తాను. ఎండిన చెట్టు వికసించేలా చేస్తాను. నేనే యెహోవాను. ఇది జరుగుతుందని నేను చెప్పాను. దీన్ని తప్పక నెరవేరుస్తాను.” [PE]