1. {#1ఇశ్రాయేలు నాయకుల గూర్చి ప్రలాప వాక్యం }
2. [PS]“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు. [PE]
3. [PS]నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది. [PE][PS]అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది. [PE]
4. [PS]వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. [PE][PS]అది మనుషులను మింగేసింది. [PE]
5. [PS]అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు. [PE][PS]వాళ్ళు అతనికి గాలాలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు. [PE]
6. [PS]దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది. [PE]
7. [PS]ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది. [PE]
8. [PS]తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడు చేశాడు. [PE][PS]అతని గర్జన శబ్దానికి ఆ దేశం, దానిలో ఉన్నదంతా ఖాళీ అయి పోయింది. [PE]
9. [PS]నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది. [PE]
10. [PS]అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. [PE][PS]దాని గర్జన ఇశ్రాయేలు పర్వతాలమీద ఇక ఎన్నటికీ వినబడకుండా వాళ్ళు దాన్ని కొండ కోటలో ఉంచారు. [PE]
11. [PS]నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది. [PE][PS]అక్కడ విస్తారమైన నీళ్ళు ఉండేవి గనుక అది ఎన్నో తీగలు కలిగి విరివిగా ద్రాక్షలు కాసేది. [PE]
12. [PS]రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి. [PE]
13. [PS]కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. [PE][PS]తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. [PE][PS]దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి. [PE]
14. [PS]కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది. [PE][PS]దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి, [PE][PS]దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు. [PE][PS]ఏలుబడి చేసేందుకు రాజదండం లేదు.” [PE][PS]ఇది ఒక శోకం, ఒక శోక గీతంగా దీన్ని పాడతారు. [PE]