1. {ప్రజలు పాపాలను ఒప్పుకొని ఎజ్రాకు విధేయులయ్యారు} PS ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.
|
2. అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు. “మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకొంటారన్న నిరీక్షణ ఉంది.
|
3. ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం.
|
5. ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులంతా ఆ మాట ప్రకారమే నడుచుకొంటామని వారి చేత ప్రమాణం చేయించాడు. వారంతా ప్రమాణం చేసిన తరువాత,
|
6. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి, ఎల్యాషీబు కొడుకు యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చెరకు లోనైన వారి అపరాధాలను బట్టి రోదిస్తూ, భోజనం చేయకుండా, నీళ్ళు తాగకుండా ఉండిపోయాడు. PEPS
|
7. చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా, యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు.
|
8. ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు.
|
9. యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.
|
10. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు. “మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు.
|
11. కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.” PEPS
|
12. అప్పుడు అక్కడ సమకూడిన వారంతా బిగ్గరగా ఇలా అన్నారు. “నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా చేయవలసి ఉంది.
|
13. అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి.
|
14. మన పట్టణాల్లో ఎవరెవరు పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నారో వాళ్ళంతా గడువులోగా రావాలి. ఈ విషయంలో మాపై దేవునికి వచ్చిన తీవ్రమైన కోపం తొలగిపోయేలా ప్రతి పట్టణాల్లోని పెద్దలు, న్యాయాధిపతులు వాళ్ళతో ఉండాలి.” PEPS
|
15. ఈ పని జరిగించడానికి అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యా, వాళ్లకు సహాయకులుగా మెషుల్లాము, లేవీ గోత్రికుడు షబ్బెతైలను నియమించారు.
|
16. చెరనుంచి వచ్చినవారు ఆ క్రమం ప్రకారం చేశారు. యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులును వారి తండ్రుల ఇంటి పేర్ల ప్రకారం ఎన్నుకున్నాడు. పదవ నెల మొదటి రోజున ఈ విషయాన్ని గూర్చి పరిశీలించడం మొదలుపెట్టారు.
|
17. మొదటి నెల మొదటి రోజునాటికి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసికొన్న వారందరి వ్యవహారం పరిష్కారం చేశారు. PS
|
18. {దోషులు} PS యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
|
19. వీరు తమ తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడంవల్ల తమ అపరాధం విషయంలో మందలోనుండి ఒక పొట్టేలును సమర్పించారు. PEPS
|
25. ఇశ్రాయేలీయుల్లో పరోషు వంశం నుండి రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా. PEPS
|
43. నెబో వంశానికి చెందిన యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనేవాళ్ళు. PEPS
|
44. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. * వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు, వారిని వారి పిల్లలతో దూరముగా ఉంచారు PE
|