1. {బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు} (2:1-70; నెహె 7:6-73) PS నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.
|
2. వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.
|
59. ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు. PEPS
|
61. ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.
|
62. వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.
|
63. ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు. PEPS
|
68. గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు. PEPS
|
69. ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.
|
70. యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు. PE
|