1. {యాకోబు వెళ్ళిపోవడం} PS ఇస్సాకు యాకోబును పిలిపించి “నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు.
|
2. నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో
|
3. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా
|
4. ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక” అని దీవించి పంపివేశాడు.
|
5. అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ. PEPS
|
6. ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు “నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు” అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది.
|
9. అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు. PS
|
11. ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.
|
12. అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
|
13. యెహోవా దానికి * యాకోబుకు సమీపంగా నిలబడి. పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. PEPS
|
14. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి.
|
15. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు. PEPS
|
18. పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు. PEPS తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు.
|
20. అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,
|
22. అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు. PE
|