5. ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది. PEPS
|
8. అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు” అని చెప్పాడు.
|
9. ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.
|
11. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది. PEPS
|
12. చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు.
|
14. షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది. PEPS
|
16. ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక “నీతో సుఖిస్తాను, రా” అని పిలిచాడు. అందుకు ఆమె “నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?” అని అడిగింది.
|
17. అందుకు అతడు “నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను” అన్నాడు. ఆమె “అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే” అని అంది.
|
18. అతడు “ఏమి తాకట్టు పెట్టమంటావ్?” అని ఆమెను అడిగాడు. ఆమె “నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర” అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది. PEPS
|
20. తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. PEPS
|
21. కాబట్టి అతడు “ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?” అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు “ఇక్కడ వేశ్య ఎవరూ లేదు” అని అతనికి చెప్పారు.
|
22. కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి “ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు” అన్నాడు.
|
23. యూదా “మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు” అని అతనితో అన్నాడు. PEPS
|
24. సుమారు మూడు నెలలైన తరువాత “నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది” అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా “ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి” అని చెప్పాడు.
|
25. ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది.
|
26. యూదా వాటిని గుర్తు పట్టి “నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతి గలది” అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు. PEPS
|
28. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి “వీడు మొదట బయటికి వచ్చాడు” అని చెప్పింది.
|
29. వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “ * ఛేదించుకుని. బద్దలు చేసుకుని. పెరెసు” అని పేరు పెట్టారు.
|
30. ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “ † ప్రకాశ మానమైన ఎరుపు రంగు. జేగురు రంగు. జెరహు” అని పేరు పెట్టారు. PE
|