1. {యాకోబు తన కొడుకులపై పలికిన దీవెనలు} PS యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
|
3. రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,
నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి. |
4. పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. PEPS ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. PEPS నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
|
6. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. PEPS నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. PEPS కోపంలో వారు మనుషులను చంపారు. PEPS సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
|
7. వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. PEPS అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. PEPS ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
|
8. యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. PEPS నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. PEPS నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
|
9. యూదా సింహం పిల్ల. PEPS నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. PEPS అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. PEPS సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. PEPS అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
|
10. షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. PEPS అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. PEPS రాజ్యాలు అతనికి లోబడతాయి.
|
11. ద్రాక్షావల్లికి తన గాడిదనూ,
మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు. |
13. జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. PEPS అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. PEPS అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.
|
15. అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. PEPS బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
|
17. దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు. |
22. యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి. |
24. అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది. |
25. నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన,
నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి. |
26. నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి. |
27. బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.” యాకోబు మరణం, సమాధి PEPS |
28. ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
|
30. హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు. PEPS
|
31. అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
|
33. యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు. PE
|