1. {#1హబక్కూకు ఫిర్యాదు }
2. [PS]ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. [PE]
3. [PS]“యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు? [PE][PS]బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు. [PE]
4. [PS]నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు? [PE][PS]బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు? [PE][PS]ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి. [PE][PS]జగడం, కలహం రేగుతున్నాయి. [PE]
5. [PS]అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది. [PE][PS]న్యాయం జరగకుండా ఆగిపోయింది. [PE][PS]భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు. [PE][PS]న్యాయం చెడిపోతున్నది. [PE]{#1యెహోవా జవాబు }
6. [PS]అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి. [PE][PS]మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు. [PE]
7. [PS]కల్దీయులను[* కల్దీయులను బబులోనీయులు ] నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు. [PE]
8. [PS]వారు ఘోరమైన భీకర జాతి. [PE][PS]వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు. [PE]
9. [PS]వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. [PE][PS]రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. [PE][PS]వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. [PE][PS]ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు. [PE]
10. [PS]వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు. [PE][PS]ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెర పట్టుకుంటారు. [PE]
11. [PS]రాజులను అపహాస్యం చేస్తారు. [PE][PS]అధిపతులను హేళన చేస్తారు. [PE][PS]ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు. [PE][PS]మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు. [PE]
12. [PS]తమ బలమే తమ దేవుడనుకుంటారు. [PE][PS]గాలి కొట్టుకుని పోయేలా వారు కొట్టుకు పోతూ అపరాధులౌతారు. [PE]{#1హబక్కూకు రెండవ ఫిర్యాదు }
13. [PS]యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? [PE][PS]మేము మరణించము. [PE][PS]యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. [PE][PS]ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు. [PE]
14. [PS]నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. [PE][PS]బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. [PE][PS]కపటులను నువ్వు చూసి కూడా, [PE][PS]దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు? [PE]
15. [PS]పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు. [PE]
16. [PS]వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. [PE][PS]ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. [PE][PS]వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు. [PE]
17. [PS]కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు. [PE][PS]తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు. [PE][PS]వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?” [PE]