1. {#1దేవుడనుగ్రహించే నిరీక్షణ, అదరణ }
2. [PS]రాజైన దర్యావేషు పరిపాలనలో ఏడవ నెల ఇరవై ఒకటవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే, [PE]
3. [PS]“నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువతోను శేషించిన జనులతోను ఇలా చెప్పు. [PE]
4. [PS]పూర్వకాలంలో ఈ మందిరానికి ఉన్న మహిమను చూసినవారు మీలో ఉన్నారు గదా. [PE][PS]అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది? [PE][PS]దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా. [PE]
5. [PS]అయినా యెహోవా ఇచ్చే ఆజ్ఞ. [PE][PS]జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో. [PE][PS]ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో. [PE][PS]దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. [PE][PS]నేను మీకు తోడుగా ఉన్నాను. [PE][PS]ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు. [PE]
6. [PS]మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. [PE][PS]నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడవద్దు. [PE]
7. [PS]సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే ఇక త్వరలోనే, [PE][PS]ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను. [PE]
8. [PS]ప్రతి రాజ్యాన్నీ నేను కదిలించగా అన్యజనులందరి విలువైన వస్తువులు తీసుకు వస్తారు. [PE][PS]నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.” [PE][PS]ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు. [PE]
9. [PS]“వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. [PE]
10. [PS]ఈ చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. [PE][PS]ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను. [PE][PS]ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. [PE]{#1పవిత్రత, అపవిత్రత }
11. [PS]దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే, [PE]
12. [PS]సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. యాజకుల దగ్గర ధర్మశాస్త్ర విచారణ చెయ్యి. [PE]
13. [PS]“ఒకడు ప్రతిష్టితమైన మాంసాన్ని తన వస్త్రపు చెంగున కట్టుకుని, [PE][PS]తన చెంగుతో రొట్టెనైనా వంటకాన్నైనా, ద్రాక్షారసాన్నైనా, [PE][PS]నూనెనైనా మరి ఏ విధమైన భోజన పదార్థాన్నైనా, [PE][PS]ముట్టుకుంటే ఆ ముట్టుకున్నది ప్రతిష్ఠితమవుతుందా?” అని యాజకులను అడిగితే, వారు “కాదు” అన్నారు. [PE]
14. [PS]“శవాన్ని ముట్టుకోవడం వల్ల ఒకడు అంటుపడి అలాటి వాటిలో దేనినైనా ముట్టుకుంటే, [PE][PS]అతడు ముట్టుకున్నది అపవిత్రం అవుతుందా?” అని హగ్గయి మళ్లీ అడిగినప్పుడు యాజకులు “అది అపవిత్రం అవుతుంది” అన్నారు. [PE]
15. [PS]అప్పుడు హగ్గయి వారికి ఈ విధంగా జవాబిచ్చాడు. [PE][PS]ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు. [PE][PS]వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు. [PE]
16. [PS]ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలు ఆ వెనుక మీకు సంభవించినదాన్ని ఆలోచన చేసుకోండి. [PE]
200. [PS]అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల[* ఇరవై కుప్పల 200 కిల్లోలు ] కంకులు వేయగా పది కుప్పలంత [† పది కుప్పలంత 100 కిల్లోలు ] ధాన్యమే తేలుతున్నది. [PE][PS]ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది. [PE]
18. [PS]తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను, మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను. [PE][PS]అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు. [PE]
19. [PS]మీరు ఆలోచించుకోండి. [PE][PS]ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి, [PE][PS]అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. [PE]
20. [PS]కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అయినా అంజూరపు చెట్లు అయినా దానిమ్మ చెట్లయినా ఒలీవ చెట్లు అయినా ఫలించాయా? [PE][PS]అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. [PE]{#1యెహోవా ఎన్నుకొన్న జెరుబ్బాబెలు }
21. [PS]రెండవ సారి ఆ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మళ్ళీ ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. [PE]
22. [PS]“యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు. [PE][PS]ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను. [PE]
23. [PS]రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. [PE][PS]అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. [PE][PS]రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. [PE][PS]గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు. [PE][PS]నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలూ, [PE][PS]నేను నిన్ను ఏర్పరచుకున్నాను. [PE][PS]కాబట్టి ఆ రోజున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.”[PE]