పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
హొషేయ
1. {#11. పశ్చాత్తాపడమని పిలుపు }
2. [PS]ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. [PE]
3. [PS]ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. [PE][PS]మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. [PE][PS]అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము. [PE]
4. [PS]అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. [PE][PS]మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. [PE][PS]‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. [PE][PS]తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.” [PE]
5. [PS]వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. [PE][PS]వారి మీదనున్న నా కోపం చల్లారింది. [PE][PS]మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను. [PE]
6. [PS]చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. [PE][PS]తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. [PE][PS]లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు. [PE]
7. [PS]అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. [PE][PS]ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. [PE][PS]లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. [PE]
8. [PS]అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. [PE][PS]ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. [PE][PS]ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. [PE][PS]లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది. [PE]
9. [PS]ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” [PE][PS]నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. [PE][PS]నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. [PE][PS]నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. [PE][PS]నావల్లనే నీకు ఫలం కలుగుతుంది. [PE][PS]ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? [PE][PS]వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? [PE][PS]ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. [PE][PS]నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.[PE]
మొత్తం 14 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 14 / 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
1 పశ్చాత్తాపడమని పిలుపు 1 2 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. 3 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము. 4 అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.” 5 వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను. 6 చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు. 7 అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. 8 అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది. 9 ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది. ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.
మొత్తం 14 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 14 / 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
×

Alert

×

Telugu Letters Keypad References