1.
2. [PS]మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి. [PE][PS]మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి. [PE]{#1ఇశ్రాయేలకు శిక్ష, యధాస్థితి }
3. [PS]మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు. [PE][PS]వ్యాజ్యం వెయ్యి. [PE][PS]ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను. [PE][PS]ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి. [PE][PS]తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి. [PE]
4. [PS]లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. [PE][PS]ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను. [PE][PS]ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను. [PE][PS]దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను. [PE]
5. [PS]ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు. [PE]
6. [PS]వారి తల్లి కులట. [PE][PS]వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. [PE][PS]ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది. [PE]
7. [PS]కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను. [PE][PS]దానికి దారి కనబడకుండా గోడ కడతాను. [PE]
8. [PS]అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది. [PE][PS]ఎంత వెతికినా వారు దానికి కనబడరు. [PE][PS]అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.” [PE]
9. [PS]దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. [PE][PS]వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు. [PE]
10. [PS]కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను. [PE][PS]ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని, జనపనార లాగేసుకుంటాను. [PE]
11. [PS]దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. [PE][PS]నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు. [PE]
12. [PS]ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను. [PE][PS]ఆమె పండగలూ అమావాస్య పర్వదినాలూ విశ్రాంతి దినాలూ వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను. [PE]
13. [PS]“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను. [PE]
14. [PS]అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. [PE][PS]ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు. [PE][PS]నగలు పెట్టుకుని, సింగారించుకుని. [PE][PS]నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. [PE][PS]ఇది యెహోవా వాక్కు. [PE]
15. [PS]ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. [PE][PS]అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను. [PE]
16. [PS]ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. [PE][PS]ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. [PE][PS]యవ్వనప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది. [PE]
17. [PS]“ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. [PE][PS]‘నా భర్త’ అంటావు.” [PE]
18. [PS]ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు. [PE]
19. [PS]“ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, [PE][PS]పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. [PE][PS]దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. [PE][PS]వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను. [PE]
20. [PS]నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. [PE][PS]నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. [PE]
21. [PS]యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. [PE]
22. [PS]ఆ దినాన నేను జవాబిస్తాను.” [PE][PS]ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి. [PE]
23. [PS]భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా, [PE][PS]అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి. [PE][PS]నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. [PE][PS]లో రుహమా పై నేను జాలి పడతాను. [PE][PS]నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, [PE][PS]వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు. [PE]