1. {#11. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుని ఉగ్రత }
2. [PS]యాజకులారా, నామాట వినండి. [PE][PS]ఇశ్రాయేలు వంశమా, శ్రద్ధగా విను. [PE][PS]రాజ వంశమా, విను. [PE][PS]మీరు మిస్పా మీద ఉరిగా, తాబోరు మీద వలగా ఉన్నారు. [PE][PS]కాబట్టి మీ అందరిపైకీ తీర్పు రాబోతున్నది. [PE]
3. [PS]తిరుగుబాటుదారులు తీవ్రంగా వధ జరిగించారు. కాబట్టి నేను వారందరినీ శిక్షిస్తాను. [PE]
4. [PS]ఎఫ్రాయిమును నేనెరుగుదును. [PE][PS]ఇశ్రాయేలువారు నాకు తెలియని వారు కారు. [PE][PS]ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వేశ్యవయ్యావు. [PE][PS]ఇశ్రాయేలువారు మైలబడి పోయారు. [PE]
5. [PS]వారు నా దగ్గరికి రాకుండా వారి క్రియలు అడ్డుపడుతున్నాయి. [PE][PS]వారిలో వ్యభిచార మనసుంది. నన్ను, అంటే యెహోవాను వారు ఎరుగరు. [PE]
6. [PS]ఇశ్రాయేలు వారి గర్వం వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది. [PE][PS]ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు తమ దోషంలో చిక్కుకుపోయి తొట్రుపడుతున్నారు. [PE][PS]వారితోబాటు యూదావారు కూడా తొట్రిల్లుతున్నారు. [PE]
7. [PS]వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని, [PE][PS]ఆయన వారికి కనబడడు. ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు. [PE]
8. [PS]వారు యెహోవాకు విశ్వాసఘాతకులయ్యారు. అక్రమ సంతానాన్ని కన్నారు. ఇక ఇప్పుడు వారి అమావాస్య పర్వదినాలు వారి పొలాలతో సహా వారిని మింగేస్తాయి. [PE]
9. [PS]గిబియాలో బాకా ఊదండి. [PE][PS]రమాలో భేరీనాదం చెయ్యండి. [PE][PS]“బెన్యామీనూ, మేము మీతో వస్తున్నాం” అని బేతావెనులో కేకలు పెట్టండి. [PE]
10. [PS]శిక్షదినాన ఎఫ్రాయిము శిథిలమై పోతుంది. [PE][PS]తప్పనిసరిగా జరగబోయే దాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారికి నేను తెలియజేస్తున్నాను. [PE]
11. [PS]యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసేసే వారిలా ఉన్నారు. [PE][PS]నీళ్లు ప్రవహించినట్టు నేను వారిపై నా ఉగ్రత కుమ్మరిస్తాను. [PE]
12. [PS]ఎఫ్రాయిమీయులు నలిగి పచ్చడైపోయారు. [PE][PS]తీర్పు వల్ల వారు సమూల నాశనమయ్యారు. [PE][PS]ఎందుకంటే వారు విగ్రహాలకు వంగి నమస్కరిస్తూ నడుచుకుంటున్నారు. [PE]
13. [PS]ఎఫ్రాయిమీయుల పాలిట చెద పురుగులాగా, [PE][PS]యూదావారికి కుళ్లిపోజేసే వ్యాధి లాగా నేను ఉంటాను. [PE]
14. [PS]తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు. [PE][PS]తన పుండును యూదా చూశాడు. [PE][PS]ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు. [PE][PS]ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. [PE][PS]అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు. [PE][PS]నీ పుండు నయం చేయలేకపోయాడు. [PE]
15. [PS]ఎందుకంటే నేను ఎఫ్రాయిమీయులకు సింహం లాగా ఉంటాను. [PE][PS]యూదావారికి కొదమ సింహం వలే ఉంటాను. [PE][PS]నేనే వారిని చీల్చేసి వెళ్ళిపోతాను. నేనే వారిని తీసుకుపోతాను. [PE][PS]వారిని విడిపించే వాడొక్కడు కూడా ఉండడు. [PE][PS]వారు తమ దోషాన్ని ఒప్పుకుని నన్ను వెదికే వరకూ నేను నా చోటికి తిరిగి వెళ్ళను. [PE][PS]తమ దురవస్థలో వారు నన్ను మనస్ఫూర్తిగా వెదికే సమయం దాకా నేను వదిలిపెట్టను. [PE]