1. {#1దుర్మార్గానికి పాల్పడి చెడిపోయిన యూదులు } [QS]యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం. [QE]
2. [QS]ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. [QE][QS]“నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. [QE]
3. [QS]ఎద్దుకు తన యజమాని తెలుసు. [QE][QS]తన మేత తొట్టి గాడిదకు తెలుసు. [QE][QS]కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.” [QE]
4. [QS]ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, [QE][QS]దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. [QE][QS]వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. [QE][QS]ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. [QE][QS]ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. [QE]
5. [QS]మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? [QE][QS]మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? [QE][QS]మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. [QE]
6. [QS]అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. [QE][QS]ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. [QE][QS]అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, [QE][QS]కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు. [QE]
7. [QS]మీ దేశం పాడైపోయింది. [QE][QS]మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి. [QE][QS]మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు. [QE][QS]తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు. [QE]
8. [QS]సీయోను కుమార్తె [* సీయోను కుమార్తె యెరూషలేము పట్టణం ]ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా, [QE][QS]దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది. [QE]
9. [QS]జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, [QE][QS]మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. [QE][QS]మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం. [QE]
10. [QS]సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. [QE][QS]గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి. [QE]
11. [QS]“యెహోవా ఇలా అంటున్నాడు. [QE][QS]విస్తారమైన మీ బలులు నాకెందుకు?” [QE][QS]“దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. [QE][QS]దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు. [QE]
12. [QS]మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు, [QE][QS]నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు? [QE]
13. [QS]అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. [QE][QS]అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను. [QE]
14. [QS]మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. [QE][QS]వాటిని సహించలేక విసిగిపోయాను. [QE]
15. [QS]మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. [QE][QS]మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. [QE][QS]మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. [QE]
16. [QS]మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. [QE][QS]మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. [QE][QS]మీ దుష్టత్వం మానండి.” [QE]
17. [QS]మంచి చెయ్యడం నేర్చుకోండి. [QE][QS]న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. [QE][QS]తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. [QE][QS]వితంతువు పక్షాన నిలబడండి. [QE]
18. [QS]యెహోవా ఇలా అంటున్నాడు. [QE][QS]“రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” [QE][QS]“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, [QE][QS]అవి మంచులా తెల్లగా అవుతాయి. [QE][QS]కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. [QE]
19. [QS]మీరు ఇష్టపడి నాకు లోబడితే, [QE][QS]మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. [QE]
20. [QS]తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, [QE][QS]కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” [QE][QS]యెహోవా నోరు ఈ మాట పలికింది. [QE]
21. [QS]నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! [QE][QS]అది న్యాయంతో నిండి ఉండేది. [QE][QS]నీతి దానిలో నివాసం ఉండేది. [QE][QS]ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు. [QE]
22. [QS]నీ వెండి మలినమైపోయింది. [QE][QS]నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది. [QE]
23. [QS]నీ అధికారులు ద్రోహులు. [QE][QS]వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. [QE][QS]అందరూ లంచం ఆశిస్తారు. [QE][QS]చెల్లింపుల వెంటబడతారు. [QE][QS]తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. [QE][QS]వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు. [QE]
24. [QS]కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. [QE][QS]“వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. [QE][QS]నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను. [QE]
25. [QS]నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను. [QE][QS]నీలో ఉన్న చెత్తను శుద్ధిచేసి, నీ కల్మషం అంతా తీసేస్తాను. [QE]
26. [QS]మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను. [QE][QS]ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను. [QE][QS]అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.” [QE]
27. [QS]సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది. [QE]
28. [QS]అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు. [QE][QS]యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు. [QE]
29. [QS]“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను[† సింధూర వృక్షాలను విగ్రహ పూజ ] బట్టి మీరు సిగ్గుపడతారు. [QE][QS]మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు. [QE]
30. [QS]మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు. [QE]
31. [QS]బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు. [QE][QS]అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి. [QE][QS]ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.” [QE]