పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
యెషయా గ్రంథము
1. {#1మోయాబు గురించి ప్రకటన [BR]16:6-12; యిర్మీ 48:29-36 } [QS]మోయాబు గురించి ప్రకటన. [QE][QS]ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. [QE][QS]ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది. [QE]
2. [QS]ఏడవడానికి మోయాబీయులు గుడికీ, [QE][QS]మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. [QE][QS]నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. [QE][QS]వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, [QE][QS]గడ్డాలు క్షవరం చేయించుకున్నారు. [QE]
3. [QS]తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. [QE][QS]వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. [QE]
4. [QS]హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. [QE][QS]యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. [QE][QS]మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. [QE][QS]వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి. [QE]
5. [QS]మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. [QE][QS]దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. [QE][QS]లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. [QE][QS]నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు. [QE]
6. [QS]ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. [QE][QS]గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు. [QE]
7. [QS]వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు. [QE]
8. [QS]రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. [QE][QS]అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది. [QE]
9. [QS]ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. [QE][QS]కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. [QE][QS]మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది. [QE]
మొత్తం 66 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 15 / 66
మోయాబు గురించి ప్రకటన
16:6-12; యిర్మీ 48:29-36

1 మోయాబు గురించి ప్రకటన. ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది. 2 ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు. 3 తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. 4 హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి. 5 మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు. 6 ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు. 7 వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు. 8 రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది. అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది. 9 ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.
మొత్తం 66 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 15 / 66
×

Alert

×

Telugu Letters Keypad References