1. {మోయాబు గురించి ప్రకటన} (16:6-12; యిర్మీ 48:29-36) PS మోయాబు గురించి ప్రకటన.
ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది. ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది. |
2. ఏడవడానికి మోయాబీయులు గుడికీ,
మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు. |
3. తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు.
వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. |
4. హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి.
యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి. |
5. మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది.
దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు. |
6. ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి.
గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు. |
7. వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
|
9. ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి.
కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను. మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది. PE |