1. {బబులోను గురించిన ప్రకటన} [PS] సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన. [QBR] “దక్షిణ దేశం నుండి తుఫాను గాలులు వీస్తున్నట్టు, [QBR] ఒక భయంకరమైన దేశం నుండి అరణ్యాన్ని దాటుకుంటూ ఆ విపత్తు వస్తూ ఉంది. [QBR]
2. దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది. [QBR] మోసగాడు మోసాలు చేస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. [QBR] ఏలాము దేశమా, వెళ్ళి దాడి చెయ్యి, మాదియా దేశమా ముట్టడి వెయ్యి. [QBR] నేను ఆమె మూలుగులను ఆపివేస్తాను. [QBR]
3. కాబట్టి నా నడుముకు విపరీతమైన నొప్పి కలిగింది. ప్రసవ వేదన పడే స్త్రీకి కలిగిన నొప్పుల్లాంటివే నాకూ కలిగాయి. [QBR] నేను విన్న దాన్ని బట్టి కుంగిపోయాను. చూసిన దాన్ని బట్టి నాకు బాధ కలుగుతున్నది. [QBR]
4. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. భయంతో నాకు జలదరింపు కలిగింది. [QBR] నేను ఆశతో ఎదురు చూసిన రాత్రి నాకు భయంతో వణుకు పుట్టింది. [QBR]
5. వాళ్ళు భోజనం బల్ల సిద్ధం చేస్తారు. తివాచీలు పరుస్తారు. అన్నం తిని, తాగుతారు. [QBR] అధిపతులారా, లేవండి. డాళ్ళకి నూనె రాయండి. [QBR]
6. ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఇది. [QBR] వెళ్ళు. ఒక కాపలా వాణ్ణి నియమించు. తాను చూస్తున్న దాని గూర్చి అతడు సమాచారం ఇవ్వాలి. [QBR]
7. అతడు ఒక రథాన్ని చూసినప్పుడు, జంట రౌతులు గుర్రాలపై రావడం చూసినప్పుడు, [QBR] గాడిదలనూ, ఒంటెలనూ ఎక్కి వాళ్ళు రావడం చూసినప్పుడు అతడు మనస్సు పెట్టి అప్రమత్తంగా ఉండాలి.” [QBR]
8. ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. “నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.” [QBR]
9. చూడండి, రథాన్ని తోలుకుంటూ ఒక వ్యక్తి గుర్రాలెక్కి వస్తున్న రౌతులతో వస్తున్నాడు. వాళ్ళు జంటలుగా ఒక దళంగా వస్తున్నారు. అతడు పిలిచి ఇలా చెప్పాడు. “బబులోను కూలి పోయింది. నిజంగానే కూలిపోయింది. దాని చెక్కిన దేవుళ్ళ బొమ్మలన్నీ విరిగి నేలకూలాయి.” [QBR]
10. నేను నూర్చిన నా ధాన్యమా, నేను చెరిగిన వాళ్ళు, నా కళ్ళంలో నూర్చిన పిల్లలు, ఇశ్రాయేలు దేవుడు, సేనలకు అధిపతి అయిన యెహోవా దగ్గర నేను విన్నది నీకు తెలియజేశాను.
11. {అరేబియాను గురించిన ప్రకటన} [PS] దూమా [* దూమా ఎదోముకు మరో పేరు, దూమా అర్ధం నిశబ్దం] గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరు [† శేయీరు ఎదోము] లో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?” [QBR]
12. అప్పుడు కావలివాడు “ఉదయం వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకుంటే అడగండి. మళ్ళీ తిరిగి రండి” అంటున్నాడు. [QBR]
13. అరేబియాను గూర్చిన ఒక దైవ ప్రకటన. దెదాను సంచార వర్తకులు, మీరు అరేబియా ఎడారిలో రాత్రి గడపాలి. [QBR]
14. తేమా దేశ వాసులారా, దాహంతో ఉన్న వారి కోసం నీళ్ళు తీసుకుని రండి. దేశ దిమ్మరుల ఎదురుగా ఆహారం తీసుకు రండి. [QBR]
15. ఎందుకంటే వాళ్ళు కత్తినుండి తప్పించుకుని పారిపోతున్నారు. దూసిన కత్తి నుండీ, ఎక్కు పెట్టిన విల్లు నుండీ, యుద్ధ భయం వల్లా పారిపోతున్నారు. [QBR]
16. ఎందుకంటే ప్రభువు నాకిలా చెప్పాడు. “మరో సంవత్సరంలోగా కూలి వాళ్ళని ఒక సంవత్సరానికి పెట్టుకున్నట్టుగా కేదారు ప్రభావం అంతా నశించిపోతుంది. [QBR]
17. కేదారు ప్రజల్లో కొద్దిమంది విలుకాళ్ళూ, శూరులూ మిగిలిపోతారు.” ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఇది. [PE]