1. {#1యెరూషలేము, యూదా పై యెహోవా న్యాయ తీర్పు } [QS]చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు. [QE][QS]దాని ఆహార సంబంధమైన ఆధారం, నీటి సరఫరా, [QE]
2. [QS]శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, [QE]
3. [QS]సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు, [QE][QS]ఘనత వహించిన వాళ్ళు, మంత్రులు, శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు, [QE][QS]మాంత్రికులు, అందరినీ యెరూషలేములోనుంచీ, యూదా దేశంలో నుంచి, తీసివేయబోతున్నాడు. [QE]
4. [QS]“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. [QE][QS]పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. [QE]
5. [QS]ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. [QE][QS]ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. [QE][QS]పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు. [QE]
6. [QS]ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, [QE][QS]‘నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. [QE][QS]ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు’ అంటాడు. [QE]
7. [QS]అతడు ఆ రోజున కేక వేసి, [QE][QS]‘నేను సంరక్షణ కర్తగా ఉండను, [QE][QS]నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. [QE][QS]నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.” [QE]
8. [QS]తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, [QE][QS]యూదా పతనమయ్యింది. [QE]
9. [QS]వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. [QE][QS]తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. [QE][QS]వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు. [QE]
10. [QS]నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. [QE][QS]వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. [QE]
11. [QS]దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. [QE][QS]అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు. [QE]
12. [QS]చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. [QE][QS]స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. [QE][QS]నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు. [QE]
13. [QS]తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. [QE][QS]తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు. [QE]
14. [QS]యెహోవా తన ప్రజల పెద్దల మీద, [QE][QS]వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. [QE][QS]“మీరే ద్రాక్షతోటను తినేశారు. [QE][QS]మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది. [QE]
15. [QS]నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” [QE][QS]అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు. [QE]
16. [QS]యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. [QE][QS]మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, [QE][QS]కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు. [QE]
17. [QS]కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు. [QE][QS]వాళ్ళ తలలు యెహోవా బోడి తలలుగా చేస్తాడు. [QE]
18. [QS]ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ, [QE]
19. [QS]చెవిపోగులూ, కడియాలూ, మేలి ముసుగులూ, [QE]
20. [QS]తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ, [QE][QS]పరిమళ ద్రవ్యపు భరిణెలూ, [QE]
21. [QS]తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు, [QE]
22. [QS]ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ, [QE]
23. [QS]చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, [QE][QS]పాగాలు, శాలువాలు తీసేస్తాడు. [QE]
24. [QS]అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, [QE][QS]నడికట్టుకు బదులుగా తాడూ, [QE][QS]అల్లిన జడకు బదులుగా బోడి తల, [QE][QS]ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, [QE][QS]అందానికి బదులు వాత ఉంటాయి. [QE]
25. [QS]మనుషులు కత్తివాత కూలి పోతారు. [QE][QS]యుద్ధంలో నీ శూరులు పడిపోతారు. [QE]
26. [QS]యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది. [QE]