1. {#1దేవుని ప్రజలకు ఆదరణ } [QS]మీ దేవుడు చెబుతున్నది ఏమంటే, [QE]
2. [QS]“ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి.” యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. [QE][QS]ఆమె యుద్ధకాలం ముగిసింది. ఆమెకు పాపాల వలన కలిగిన దోషం తీరిపోయింది. [QE][QS]ఆమెకు చెప్పండి, యెహోవా చేతిలో ఆమె తన సమస్త పాపాల నిమిత్తం రెండింతల ఫలితం పొందిందని. [QE]
3. [QS]వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు, [QE][QS]“అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.” [QE]
4. [QS]ప్రతి లోయను ఎత్తు చేయాలి. ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణిచివేయాలి. [QE][QS]వంకర వాటిని తిన్నగా, గరుకైన వాటిని నునుపుగా చేయాలి. [QE]
5. [QS]యెహోవా మహిమ వెల్లడి అవుతుంది. ఎవ్వరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు. [QE][QS]ఎందుకంటే యెహోవా దేవుడే ఇలా సెలవిచ్చాడు. [QE]
6. [QS]వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది. [QE][QS]“నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది. [QE]
7. [QS]యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే. [QE]
8. [QS]గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.” [QE]
9. [QS]సువార్త ప్రకటిస్తున్న సీయోనూ[* సువార్త ప్రకటిస్తున్న సీయోనూ సీయోనూ నుండి ], ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ [† సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ యెరూషలేము నుండి ], భయపడకుండా స్థిరంగా ప్రకటించు. [QE][QS]“ఇదిగో మీ దేవుడు” అని యూదా పట్టణాలకు ప్రకటించు. [QE]
10. [QS]ఇదిగో, ప్రభువైన యెహోవా జయశాలి అయిన యోధునిగా వస్తున్నాడు. తన బలమైన చేతితో ఆయన పాలిస్తాడు. [QE][QS]ఆయన ఇవ్వదలచిన బహుమానం ఆయనతో ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనకు ముందుగా నడుస్తున్నది. [QE]
11. [QS]ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. [QE][QS]పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు. [QE]
12. [QS]తన దోసిలిలో జలాలను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశాలను కొలిచిన వాడెవడు? [QE][QS]భూమిలోని మన్ను అంతటినీ కొలపాత్రలో ఉంచిన వాడెవడు? [QE][QS]త్రాసుతో పర్వతాలను, తూనికతో కొండలను తూచిన వాడెవడు? [QE]
13. [QS]యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఒక మంత్రిలాగా ఆయనకు సలహా చెప్పిన వాడెవడు? [QE][QS]ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఆలోచన అడిగాడా? [QE]
14. [QS]ఆయనకు తెలివిని ఇచ్చిన వాడెవడు? న్యాయమార్గాలను ఆయనకు నేర్పిన వాడెవడు? [QE][QS]ఆయనకు జ్ఞానాభ్యాసం చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధిమార్గం బోధించిన వాడెవడు? [QE]
15. [QS]రాజ్యాలు చేద నుండి జారిపడే నీటి బిందువుల్లాంటివి. ప్రజలు త్రాసు మీది దుమ్మువంటివారు. [QE][QS]ద్వీపాలు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువుల్లా ఉన్నాయి. [QE]
16. [QS]అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు. [QE]
17. [QS]ఆయన దృష్టికి సమస్త రాజ్యాలు లేనట్టుగానే ఉంటాయి. [QE][QS]ఆయన వాటిని విలువ లేనివిగా, వ్యర్ధంగా ఎంచుతాడు. [QE]
18. [QS]కాబట్టి మీరు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఏ విగ్రహ రూపాన్ని ఆయనకు సమానం చేస్తారు? [QE]
19. [QS]విగ్రహాన్ని గమనిస్తే, ఒక శిల్పి దాన్ని పోతపోస్తాడు. [QE][QS]కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు. [QE]
20. [QS]విలువైన దాన్ని అర్పించలేని పేదవాడు పుచ్చిపోని చెక్కను తీసుకొస్తాడు. [QE][QS]స్థిరంగా నిలిచే విగ్రహాన్ని చేయడానికి నేర్పుగల పనివాణ్ణి పిలుస్తాడు. [QE]
21. [QS]మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? [QE][QS]భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా? [QE]
22. [QS]ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు [QE][QS]దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. [QE][QS]ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు. [QE]
23. [QS]రాజులను ఆయన శక్తిహీనులుగా చేస్తాడు. భూమిని పాలించే వారిని నిరర్ధకం చేస్తాడు. [QE]
24. [QS]చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు. [QE][QS]సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు. [QE]
25. [QS]“ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. [QE]
26. [QS]మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా. [QE][QS]తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు. [QE]
27. [QS]యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు? [QE]
28. [QS]నీకు తెలియలేదా? నీవు వినలేదా? [QE][QS]భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు. [QE][QS]ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం. [QE]
29. [QS]అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే. [QE]
30. [QS]యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు. [QE]
31. [QS]అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు. [QE][QS]వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. [QE][QS]అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు. [QE]