పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
యెషయా గ్రంథము
1. {బబులోనుకు వ్యతిరేకంగా తీర్పు} [PS] బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో. [QBR] కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. [QBR] నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు. [QBR]
2. తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి. [QBR] కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు. [QBR]
3. నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది. [QBR] నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను. [QBR]
4. మా విమోచకునికి సేనల అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా అని పేరు. [QBR]
5. కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో. [QBR] రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు. [QBR]
6. నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను. [QBR] కాని నువ్వు వారి మీద కనికరం చూపలేదు. వృద్ధుల మీద నీ బరువైన కాడిని మోపావు. [QBR]
7. నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు, [QBR] వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు. [QBR]
8. కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. [QBR] నేనెన్నటికీ విధవరాలిని కాను, పుత్రశోకం నాకు కలగదు” అనుకుంటున్నావు. ఇదిగో, ఈ మాటను విను. [QBR]
9. పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి. [QBR] నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి. [QBR]
10. నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు. [QBR] నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి. [QBR]
11. వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు. [QBR] కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు. [QBR] నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది. [QBR]
12. నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు. [QBR] ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో. [QBR]
13. నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు. [QBR] జ్యోతిష్యులనూ, నక్షత్రాలు చూసి, నెలలు లెక్కించి శకునాలు చెప్పేవారినీ పిలిచి, [QBR] నీకు జరగబోయేవి నీ మీదికి రాకుండా తప్పించి నిన్ను రక్షిస్తారేమో ఆలోచించు. [QBR]
14. వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది. [QBR] అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు. [QBR] అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు. [QBR]
15. నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు. [QBR] నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు. [QBR] నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 66 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 47 / 66
యెషయా గ్రంథము 47:36
బబులోనుకు వ్యతిరేకంగా తీర్పు 1 బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో. కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు. 2 తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి. కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు. 3 నీ చీర కూడా తీసేస్తారు. నీ నగ్నత్వం బయటపడుతుంది. నేను మనుషులపై ప్రతీకారం తీర్చుకునేటప్పుడు వారిపై జాలిపడను. 4 మా విమోచకునికి సేనల అధిపతి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన యెహోవా అని పేరు. 5 కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో. రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు. 6 నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను. కాని నువ్వు వారి మీద కనికరం చూపలేదు. వృద్ధుల మీద నీ బరువైన కాడిని మోపావు. 7 నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు, వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు. 8 కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. నేనెన్నటికీ విధవరాలిని కాను, పుత్రశోకం నాకు కలగదు” అనుకుంటున్నావు. ఇదిగో, ఈ మాటను విను. 9 పుత్ర శోకం, వైధవ్యం, ఈ రెండూ ఒక్క నిమిషంలో ఒకే రోజున నీకు కలుగుతాయి. నువ్వు ఎంతగా శకునం చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాలపై ఆధారపడినా ఈ అపాయాలు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి. 10 నీ దుర్మార్గంలో మునిగిపోయి “ఎవడూ నన్ను చూడడు” అని అనుకున్నావు. నీ విద్య, నీ జ్ఞానం “నేనే. నాలాగా మరి ఎవరూ లేరు” అని విర్రవీగేలా చేశాయి. 11 వినాశనం నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు మంత్రాలతో దాన్ని పోగొట్టలేవు. కీడు నీ మీద పడుతుంది, దాన్ని నువ్వు నివారించలేవు. నీకు తెలియకుండా విపత్తు నీ మీదికి అకస్మాత్తుగా ముంచుకొస్తుంది. 12 నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో. 13 నీ విస్తారమైన చర్చల వలన నువ్వు అలసిపోయావు. జ్యోతిష్యులనూ, నక్షత్రాలు చూసి, నెలలు లెక్కించి శకునాలు చెప్పేవారినీ పిలిచి, నీకు జరగబోయేవి నీ మీదికి రాకుండా తప్పించి నిన్ను రక్షిస్తారేమో ఆలోచించు. 14 వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు. అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు. 15 నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు. నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు. నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు.
మొత్తం 66 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 47 / 66
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References