1. {#1ద్రాక్షతోట ఉపమానం } [QS]నా ప్రియుణ్ణి గురించి పాడతాను వినండి. అతని ద్రాక్షతోట విషయమై నాకు ఇష్టమైన వాణ్ణి గురించి గానం చేస్తాను. వినండి. [QE][QS]సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది. [QE]
2. [QS]ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. [QE][QS]దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. [QE][QS]ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది. [QE]
3. [QS]కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పమని మీకు విన్నవించుకుంటున్నాను. [QE]
4. [QS]నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరి ఇంకా ఏమి చేయగలను? [QE][QS]అది ద్రాక్షపండ్లు కాస్తుందని నేను ఎదురు చూస్తే అది పిచ్చి ద్రాక్షలు ఎందుకు కాసింది? [QE]
5. [QS]ఆలోచించండి, నేను నా ద్రాక్షతోటకు చేయబోయే దాన్ని మీకు వివరిస్తాను. [QE][QS]దాన్ని పశువులు మేసేలా దాని కంచెను కొట్టి వేస్తాను. [QE][QS]అందరూ దాన్ని తొక్కేలా దాని గోడను పడగొట్టి పాడుచేస్తాను. [QE]
6. [QS]ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. [QE][QS]దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను. [QE]
7. [QS]ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. [QE][QS]ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది. [QE]
8. {#1యూదాకు వ్యతిరేకంగా దేవుని తీర్పు } [QS]స్థలం మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకుంటూ పోతున్న మీకు బాధ. [QE]
9. [QS]నేను చెవులారా వినేలా సేనల ప్రభువు యెహోవా స్పష్టంగా ఈ మాట నాకు చెప్పాడు. [QE][QS]నిజంగా గొప్పవి, అందమైన చాలా ఇళ్ళు వాటిలో నివాసముండే వారు లేక పాడైపోతాయి. [QE]
10. [QS]పది ఎకరాల ద్రాక్షతోట ఇరవై లీటర్ల రసం మాత్రం ఇస్తుంది. [QE][QS]పది కిలోల గింజలు చల్లగా పండిన పంట ఒక కిలో అవుతుంది. [QE]
11. [QS]మద్యం తాగుదామని తెల్లారే లేచి తమకు మంట పుట్టించే దాకా చాలా రాత్రి వరకూ ద్రాక్షారసం తాగే వారికి బాధ. [QE]
12. [QS]వారు సితారా, స్వరమండలం, తంబుర, సన్నాయి వాయిస్తూ ద్రాక్షారసం తాగుతూ విందు చేస్తారు గానీ యెహోవా పని గురించి ఆలోచించరు. [QE][QS]ఆయన తన చేతితో చేసిన వాటిని లక్ష్యపెట్టరు. [QE]
13. [QS]అందువల్ల నా ప్రజలు జ్ఞానం లేక చెరలోకి వెళ్లిపోతున్నారు. [QE][QS]వారిలో ఘనులు పస్తులుంటున్నారు. సామాన్యులు దాహంతో అలమటిస్తున్నారు. [QE]
14. [QS]అందుకనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని తన నోరు బార్లా తెరుస్తున్నది. [QE][QS]వారిలో గొప్పవారు, సామాన్య ప్రజలు, నాయకులు, తమలో విందులు చేసుకుంటూ సంబరాలు చేసుకునే వారు పాతాళానికి దిగిపోతారు. [QE]
15. [QS]సామాన్యుడు మట్టి కరుస్తాడు. గొప్పవాడు తగ్గిపోతాడు. ఘనత పొందిన వారు తమ కళ్ళు నేలకు దించుకుంటారు. [QE]
16. [QS]సేనల ప్రభువు యెహోవాయే తన న్యాయాన్ని బట్టి ఘనత పొందుతాడు. [QE][QS]పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధతను కనపరుస్తాడు. [QE]
17. [QS]అప్పుడు ధనికుల స్థలాలు గొర్రెలకు[* గొర్రెలకు ఇతర దేశ ప్రజలకు ] మేత బీడుగా ఉంటాయి. వారి శిథిలాల్లో గొర్రెపిల్లలు మేస్తాయి. [QE]
18. [QS]శూన్యత తాళ్ళతో అతిక్రమాన్ని లాక్కుంటూ ఉండే వారికి బాధ. [QE][QS]మోకులతో పాపాన్ని లాగే వారికి బాధ. [QE]
19. [QS]“దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. [QE][QS]ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ. [QE]
20. [QS]కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. [QE][QS]చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ. [QE]
21. [QS]తమ దృష్టికి తాము జ్ఞానులమనీ తమ అంచనాలో తాము బుద్ధిమంతులమనీ ఊహించుకునే వారికి బాధ. [QE]
22. [QS]ద్రాక్షారసం తాగడంలో పేరు తెచ్చుకున్న వారికి, మద్యం కలపడంలో చాతుర్యం గల వారికి బాధ. [QE]
23. [QS]వారు లంచం పుచ్చుకుని దుర్మార్గుణ్ణి వదిలేస్తారు. నిర్దోషి హక్కులు హరిస్తారు. [QE]
24. [QS]అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు, ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. [QE][QS]వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది. [QE][QS]ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. [QE][QS]ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు. [QE]
25. [QS]దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. [QE][QS]ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. [QE][QS]వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. [QE][QS]ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది. [QE]
26. [QS]ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. [QE][QS]భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. [QE][QS]అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు. [QE]
27. [QS]వారిలో అలసిపోయిన వాడు గానీ తొట్రు పడేవాడు గానీ లేడు. [QE][QS]వారిలో ఎవడూ నిద్రపోడు, కునికిపాట్లు పడడు. [QE][QS]వారి నడికట్టు వదులు కాదు. వారి చెప్పుల వారు తెగిపోదు. [QE]
28. [QS]వారి బాణాలు పదునైనవి. [QE][QS]వారి విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి. [QE][QS]వారి గుర్రాల డెక్కలు చెకుముకిరాళ్ల వంటివి. [QE][QS]వారి రథచక్రాలు తుఫాను లాంటివి. [QE]
29. [QS]సింహం గర్జించినట్టు వారు గర్జిస్తారు. [QE][QS]సింహం కూనలాగా గర్జిస్తారు. [QE][QS]వేటను నోట కరుచుకుని యధేచ్ఛగా ఈడ్చుకుపోతారు. [QE][QS]విడిపించగల వారెవరూ ఉండరు. [QE]
30. [QS]వారు ఆ దినాన సముద్ర ఘోష వలె తమ ఎరపై గర్జన చేస్తారు. [QE][QS]ఒకడు దేశం కేసి చూస్తే అంధకారం, దురవస్థ కనిపిస్తాయి. [QE][QS]మేఘాలు కమ్మి వెలుగంతా చీకటై పోతుంది. [QE]