1. {#1ప్రతీకార దినం, విమోచన దినం } [QS]ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? [QE][QS]రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? [QE][QS]నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి. [QE]
2. [QS]నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి? [QE]
3. [QS]ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు. [QE][QS]కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను. [QE][QS]వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే. [QE]
4. [QS]పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది. [QE]
5. [QS]సాయం చేసేవాడి కోసం చూశాను. ఎవరూ రాలేదు. ఎవడూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. [QE][QS]అయితే నా హస్తమే నాకు విజయం సాధించిపెట్టింది. నా ఆగ్రహం నన్ను నడిపించింది. [QE]
6. [QS]కోపంతో ప్రజలను తొక్కేశాను. నా ఆగ్రహంతో వారికి మత్తెక్కించాను. వారి రక్తాన్ని నేల పారబోశాను. [QE]
7. {#1స్తుతి, ప్రార్థన } [QS]యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను. [QE][QS]యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను. [QE][QS]తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను. [QE]
8. [QS]అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు. [QE]
9. [QS]వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. [QE][QS]ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. [QE][QS]పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు. [QE]
10. [QS]అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. [QE][QS]కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు. [QE]
11. [QS]ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. [QE][QS]వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? [QE][QS]వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? [QE]
12. [QS]మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి? [QE]
13. [QS]తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి? [QE][QS]లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు. [QE]
14. [QS]లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు. [QE][QS]నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు. [QE]
15. [QS]పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. [QE][QS]నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? [QE][QS]మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి. [QE]
16. [QS]అయితే మా తండ్రివి నువ్వే. [QE][QS]అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, [QE][QS]యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా. [QE]
17. [QS]యెహోవా, నీ విధానాలనుంచి మమ్మల్ని తప్పిస్తున్నావెందుకు? [QE][QS]మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు? [QE][QS]నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా. [QE]
18. [QS]నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు. [QE]
19. [QS]నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం. [QE]