పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
యిర్మీయా
1. {#1యిర్మీయా, పషూరు }
2. [PS]ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు. [PE]
3. [PS]కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు. [PE]
4. [PS]మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్‌[* మాగోర్ మిస్సాబీబ్‌ నలుదిక్కులా భయం ]’ అని పెడతాడు.” [PE][QS]యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు. [QE]
5. [QS]ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు. [QE]
6. [QS]పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు. [QE]
7. {#1యిర్మీయా ఫిర్యాదు } [QS]యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. [QE]
8. [QS]ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది. [QE]
9. [QS]‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు. [QE]
10. [QS]చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు. [QE]
11. [QS]అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది. [QE]
12. [QS]సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు. [QE]
13. [QS]యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు. [QE]
14. [QS]నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక. [QE]
15. [QS]‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక. [QE]
16. [QS]ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక! [QE]
17. [QS]యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు. [QE]
18. [QS]కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?” [QE]
మొత్తం 52 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 20 / 52
యిర్మీయా, పషూరు 1 2 ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు. 3 కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు. 4 మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్‌[* మాగోర్ మిస్సాబీబ్‌ నలుదిక్కులా భయం ]’ అని పెడతాడు.” యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు. 5 ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు. 6 పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు. యిర్మీయా ఫిర్యాదు 7 యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. 8 ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది. 9 ‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు. 10 చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు. 11 అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది. 12 సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు. 13 యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు. 14 నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక. 15 ‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక. 16 ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక! 17 యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు. 18 కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”
మొత్తం 52 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 20 / 52
×

Alert

×

Telugu Letters Keypad References