1. పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
2. {మిడతల తెగులు} [PS] పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. [QBR] మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ [QBR] ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా? [QBR]
3. దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి. [QBR] మీ పిల్లలు తమ పిల్లలకు, వాళ్ళ పిల్లలు తరువాత తరానికి చెబుతారు. [PE][PS]
4. ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి. [QBR] పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి. [QBR] మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి. [QBR]
5. తాగుబోతులారా, లేచి ఏడవండి. [QBR] ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి. [QBR] ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు. [QBR]
6. ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది. [QBR] బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు. [QBR] దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి. [QBR] అతనికి ఆడసింహం పళ్ళున్నాయి [* అతనికి ఆడసింహం పళ్ళున్నాయి ప్రకటన 9:7-10 ] . [QBR]
7. అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. [QBR] నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. [QBR] దాని బెరడు ఒలిచి పారేశాడు. [QBR] వాటి కొమ్మలు తెల్లబారాయి. [PE][PS]
8. తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు. [QBR]
9. నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి. [QBR] యెహోవా సేవకులు, యాజకులు ఏడుస్తున్నారు. [QBR]
10. పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. [QBR] ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. [QBR] నూనె ఒలికి పోయింది. [QBR]
11. గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి, [QBR] ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది. [QBR]
12. ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి. [QBR] దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఆపిల్ చెట్లు, [QBR] పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. [QBR] మనుషులకు సంతోషమే లేదు. [PS]
13. {పశ్చాతపనికి పిలుపు} [PS] యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి! [QBR] బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి. [QBR] నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి. [QBR] నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి. [QBR]
14. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. [QBR] యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ [QBR] మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి. [PE][PS]
15. యెహోవా దినం దగ్గర పడింది. [QBR] అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! [QBR] సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది. [QBR]
16. మన కళ్ళముందే ఆహారం, [QBR] మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా? [QBR]
17. విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, [QBR] పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, [QBR] కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి. [PE][PS]
18. మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! [QBR] పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి! [QBR]
19. యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను. [QBR] అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది, [QBR] మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి. [QBR]
20. కాలవలు ఎండిపోయాయి, [QBR] అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోవడంతో [QBR] పొలాల్లోని పశువులు నీ కోసం దాహంగా ఉన్నాయి. [PE]