1. {యూదాకు కేటాయించిన సరిహద్దులు} (15:15-19; న్యాయా 1:11-15) PS యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.
|
2. వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు * ఉప్పు సముద్రపు మృత సముద్రం ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
|
3. వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి
|
4. అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
|
5. దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.
|
6. ఆ సరిహద్దు బేత్హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది. PEPS
|
7. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్రోగేలు దగ్గర ఉంది.
|
8. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
|
9. ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.
|
10. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.
|
11. ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
|
13. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.
|
16. కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే
|
17. కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.
|
18. ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
|
19. “నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
|
63. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు. PE
|