1. {#1దెబోరా గీతం }
2. [PS]ఆ రోజు దెబోరా, అబీనోయము కొడుకు బారాకు, ఈ కీర్తన పాడారు, [PE][QS]ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు [QE][QS]ప్రజలు సంతోషంగా, స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొన్నారు. [QE][QS]మేము యెహోవాను స్తుతిస్తాం! [QE]
3. [QS]రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి! [QE][QS]నేను యెహోవాకు కీర్తన పాడుతాను. [QE][QS]ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను స్తుతుల కీర్తన పాడుతాను. [QE]
4. [QS]యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, [QE][QS]ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, [QE][QS]భూమి కంపించింది. ఆకాశం వణికింది. [QE][QS]మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి. [QE]
5. [QS]యెహోవా సముఖంలో కొండలు కంపించాయి. [QE][QS]ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సముఖంలో సీనాయి కొండ కూడా కంపించింది. [QE]
6. [QS]అనాతు కొడుకు షమ్గరు దినాల్లో యాయేలు దినాల్లో రాజమార్గాలు ఎడారులుగా మారాయి. [QE][QS]ప్రయాణికులు ఎవరూ నడవని పక్క త్రోవల్లోనే నడిచారు. [QE]
7. [QS]దెబోరా అనే నేను రాకముందు, ఇశ్రాయేలీయుల్లో పనివాళ్ళు లేకుండా పోయారు. [QE][QS]ఒక తల్లి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించ వలసి వచ్చింది! [QE]
8. [QS]ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంపిక చేసుకున్నారు. [QE][PIS]యుద్ధం వాళ్ళ ముఖ ద్వారాల దగ్గరికి వచ్చింది. [PIE][PIS]ఇశ్రాయేలీయుల్లో నలభై వేలమందిలో [PIE][QS]ఒక్కడికైనా ఒక డాలే గానీ ఒక ఈటె గానీ కనిపించలేదు. [QE]
9. [QS]ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా తమకైతాముగా యుద్ధానికి సిద్ధపడ్డారు. [QE][QS]వారిని బట్టి యెహోవాను స్తుతించండి! [QE]
10. [QS]తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారూ, తివాచీల మీద కూర్చునేవారూ, [QE][QS]త్రోవల్లో నడిచేవారూ, ఇది వినండి! [QE]
11. [QS]పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే[* విల్లుకాండ్రు చేసే పాటలు పాడేవాళ్ళ ] స్వరాలు వినండి. [QE][QS]యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు. [QE][QS]ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు. [QE][QS]“యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్ళారు. [QE]
12. [QS]మేలుకో, మేలుకో దెబోరా, మేలుకో, మేలుకో, కీర్తన పాడు! [QE][QS]బారాకూ వెళ్ళు, అబీనోయము కుమారా, వెళ్ళు. నీ శత్రువులను బంధించు. [QE]
13. [QS]ప్రాణాలతో ఉన్న కొందరు ఇశ్రాయేలు ప్రజలు [QE][QS]తాబోరు కొండ దిగి ప్రముఖుల దగ్గరికి వచ్చారు. [QE][QS]యెహోవా ప్రజలు యుద్ధ శూరులతో ఉన్న నా దగ్గరికి వచ్చారు. [QE]
14. [QS]కొందరు ఎఫ్రాయీము నుంచి వచ్చినవాళ్ళు. [QE][QS]వాళ్ళు ఒకప్పుడు అమాలేకీయుల దేశ నివాసులు. బెన్యామీనీయుల ప్రజలు నీ వెంటే వచ్చారు. [QE][QS]మాకీరు నుంచి న్యాయాధిపతులు, జెబూలూనీయుల నుంచి నాయకదండం మోసేవాళ్ళూ వచ్చారు. [QE]
15. [QS]ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. [QE][QS]ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు. [QE][QS]రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. [QE]
16. [QS]గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు? [QE][QS]రూబేనీయుల తెగల వారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. [QE]
17. [QS]గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. [QE][QS]దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు? [QE][QS]ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు? [QE]
18. [QS]జెబూలూనీయులకు మరణభయం లేదు. [QE][QS]వారు ప్రాణాలు సైతం లెక్కచెయ్యని ప్రజలు. [QE][QS]నఫ్తాలీయులు కూడా యుద్ధభూమిలో ప్రాణాలు లెక్క చెయ్యలేదు. [QE]
19. [QS]రాజులు వచ్చి యుద్ధం చేశారు. [QE][QS]మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో కనాను రాజులు యుద్ధం చేశారు. [QE]
20. [QS]కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు. [QE][QS]నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి. [QE][QS]నక్షత్రాలు తమ ఆకాశమార్గాల్లో నుంచి సీసెరాతో యుద్ధం చేశాయి. [QE]
21. [QS]కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు. [QE][QS]నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో! [QE]
22. [QS]గుర్రాల డెక్కల శబ్దాలతో నేల దద్దరిల్లింది. యుద్ధశూరుల గుర్రాలు కదం తొక్కాయి. [QE]
23. [QS]యెహోవా దూత ఇలా అన్నాడు ‘మేరోజును శపించండి.’ [QE][QS]‘దాని నివాసులను తప్పనిసరిగా శపించండి. యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు. [QE][QS]బలిష్ఠులైన యుద్ధశూరులతో చేసిన యుద్ధంలో యెహోవాకు సహాయంగా వాళ్ళు రాలేదు.’ [QE]
24. [QS]కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది. [QE]
25. [QS]అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. [QE][QS]సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది. [QE][QS]ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది. [QE]
26. [QS]పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది. [QE][QS]ఆమె అతని తల పగలగొట్టింది. [QE][QS]ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది. [QE]
27. [QS]అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు. [QE][QS]ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు. [QE][QS]అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు. [QE]
28. [QS]సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది. [QE][QS]అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది [QE][QS]అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి? [QE][QS]అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? [QE]
29. [QS]ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన రాకుమార్తెలు జవాబిచ్చారు. [QE][QS]ఆమె తనకు తాను మళ్ళీ అదే జవాబు చెప్పుకుంది. [QE]
30. [QS]‘కొల్లసొమ్ము వాళ్ళకు దొరకలేదా? దాన్ని వాళ్ళు పంచుకోలేదా? [QE][QS]యోధులందరూ ఒకరు, లేక ఇద్దరు స్త్రీలను తీసుకోలేదా? [QE][QS]సీసెరాకు రంగులు అద్దిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరకుతుంది. [QE][QS]రంగులు దిద్ది బుటా పని చేసిన వస్త్రం దోపుడు సొమ్ముగా దొరుకుతుంది. [QE][QS]రెండు వైపులా రంగులు అద్ది, బుటాదారీ పనిచేసిన వస్త్రం దోచుకొన్నవాళ్ళ మెడలకు తగినది వాళ్లకు దొరుకుతుంది.’ [QE]
31. [QS]యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి. [QE][QS]ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.” [QE][QS]ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. [QE]