1. {#1నిర్మానుష్యమైన యెరూషలేము }
2. [PS]ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం[* పట్టణం యెరూషలేము పట్టణం ], ఇప్పుడు వెలవెలబోయింది. [PE][PS]ఒకప్పుడు శక్తివంతమైన దేశం, ఇప్పుడు వితంతువులా అయ్యింది. [PE][PS]ఒకప్పుడు అన్య జాతుల్లో రాకుమారిలా ఉండేది, ఇప్పుడు బానిస అయింది. [PE]
3. [PS]రాత్రివేళ ఎంతో శోకిస్తూ ఉంది. [PE][PS]కన్నీటితో దాని చెంపలు తడిసిపోయాయి. [PE][PS]దాని ప్రేమికులెవ్వరూ దాన్ని ఆదరించలేదు. [PE][PS]దాని స్నేహితులందరూ దానికి ద్రోహం చేశారు. [PE][PS]వాళ్ళు దాని శత్రువులయ్యారు. [PE]
4. [PS]యూదా పేదరికం, బాధ అనుభవించి, దాస్యంలోకీ, చెరలోకీ వెళ్ళింది. [PE][PS]అన్యజనుల్లో నివాసం ఉంది. [PE][PS]దానికి విశ్రాంతి లేదు. [PE][PS]దాన్ని తరిమే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. తప్పించుకునే దారే లేదు. [PE]
5. [PS]నియమించిన పండగలకు ఎవరూ రాలేదు గనక సీయోను దారులు సంతాపంతో ఉన్నాయి. [PE][PS]పట్టణపు గుమ్మాలు ఒంటరివయ్యాయి. యాజకులు మూలుగుతున్నారు. [PE][PS]దాని కన్యలు దుఃఖంతో ఉన్నారు. [PE][PS]అది అమితమైన బాధతో ఉంది. [PE]
6. [PS]దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు. [PE][PS]దాని పాపం అధికమైన కారణంగా యెహోవా దాన్ని బాధకు గురి చేశాడు. [PE][PS]విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు. [PE]
7. [PS]సీయోను కుమారి అందమంతా పోయింది. [PE][PS]దాని అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు. [PE][PS]వాళ్ళు శక్తి లేనివాళ్ళుగా తరిమే వాళ్ళ ముందు నిలబడ లేక పారిపోయారు. [PE]
8. [PS]దానికి బాధ కలిగిన కాలంలోనూ, ఆశ్రయం లేని కాలం లోనూ, పూర్వం తనకు కలిగిన శ్రేయస్సు అంతా యెరూషలేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. [PE][PS]దాని ప్రజలు విరోధుల చేతుల్లో పడిన కాలంలో దానికి ఎవ్వరూ సాయం చెయ్యలేదు. [PE][PS]దాని విరోధులు దానికి కలిగిన నాశనం చూసి పరిహసించారు. [PE]
9. [PS]యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. [PE][PS]ఆ కారణంగా అది ఒక రుతుస్రావం రక్తం గుడ్డలాగా అయ్యింది. [PE][PS]దాన్ని ఘనపరచిన వాళ్ళందరూ దాని నగ్నత్వం చూసి దాన్ని తృణీకరించారు. [PE][PS]అది మూలుగుతూ వెనుదిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. [PE]
10. [PS]దాని చెంగులకు మురికి అంటింది. [PE][PS]దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. [PE][PS]అది ఎంతో వింతగా పతనం అయ్యింది. [PE][PS]దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. [PE][PS]యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. [PE][PS]శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు! [PE]
11. [PS]దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. [PE][PS]దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది. [PE]
12. [PS]దాని కాపురస్థులందరూ మూలుగుతూ ఆహారం కోసం వెదుకుతున్నారు. [PE][PS]తమ ప్రాణం నిలుపుకోవడం కోసం తమ శ్రేష్ఠమైన వస్తువులు ఇచ్చి ఆహారం కొన్నారు. [PE][PS]యెహోవా, నన్ను చూడు. నేను విలువ లేని దానిగా అయ్యాను. [PE]
13. [PS]దారిలో నడిచిపోతున్న ప్రజలారా, ఇలా జరిగినందుకు మీకు ఏమీ అనిపించడం లేదా? [PE][PS]యెహోవాకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున నాకు కలిగించిన బాధవంటి బాధ ఇంకా ఎవరికైనా కలిగిందేమో మీరు ఆలోచించి చూడండి. [PE]
14. [PS]పై నుంచి ఆయన నా ఎముకల్లోకి అగ్ని పంపించాడు. [PE][PS]అది నా ఎముకలను కాల్చేసింది. ఆయన నా కాళ్ళకు వల పన్ని నన్ను వెనక్కి తిప్పాడు. [PE][PS]ఆయన నిరంతరం నాకు ఆశ్రయం లేకుండా చేసి నన్ను బలహీనపరిచాడు. [PE]
15. [PS]నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు. [PE][PS]అవి మూటగా నా మెడ మీద ఉన్నాయి. [PE][PS]నా బలం ఆయన విఫలం చేశాడు. [PE][PS]శత్రువుల చేతికి ప్రభువు నన్ను అప్పగించాడు. నేను నిలబడ లేకపోతున్నాను. [PE]
16. [PS]నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు. [PE][PS]నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు. [PE][PS]ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు. [PE]
17. [PS]వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను. [PE][PS]నా కంట నీరు కారుతోంది. [PE][PS]నా ప్రాణం తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకు దూరమైపోయారు. [PE][PS]శత్రువులు విజయం సాధించారు గనుక నా పిల్లలు దిక్కుమాలిన వాళ్ళయ్యారు. [PE]
18. [PS]ఆదరించేవాడు లేక సీయోను చేతులు చాపింది. [PE][PS]యాకోబుకు చుట్టూ ఉన్న వాళ్ళను యెహోవా అతనికి విరోధులుగా నియమించాడు. [PE][PS]వాళ్ళకు యెరూషలేము ఒక రుతుస్రావ రక్తం గుడ్డలాగా కనిపిస్తోంది. [PE]
19. [PS]యెహోవా న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. [PE][PS]ప్రజలారా, వినండి, నా యాతన చూడండి. నా కన్యలూ, బలవంతులైన నా శూరులూ బందీలుగా వెళ్ళిపోయారు. [PE]
20. [PS]నా ప్రేమికులను నేను పిలిపించినప్పుడు వాళ్ళు నన్ను మోసం చేశారు. [PE][PS]నా యాజకులూ, నా పెద్దలూ తమ ప్రాణాలు నిలుపుకోడానికి ఆహారం వెదుకుతూ వెళ్లి పట్టణంలో ప్రాణం పోగొట్టుకున్నారు. [PE]
21. [PS]యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది. [PE][PS]నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది. [PE][PS]వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది. [PE]
22. [PS]నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు. [PE][PS]నువ్వు ప్రకటించిన ఆ రోజు రప్పించు, అప్పుడు వాళ్ళకు కూడా నాకు జరిగినట్టే జరుగుతుంది. [PE][PS]వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక. [PE][PS]నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు. [PE][PS]నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది. [PE]