1. {#1యెహోవా తీర్పు }
2. [PS]ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. [PE][PS]ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. [PE][PS]తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు. [PE]
3. [PS]యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. [PE][PS]తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. [PE][PS]ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. [PE][PS]దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు. [PE]
4. [PS]తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. [PE][PS]శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. [PE][PS]చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు. [PE]
5. [PS]ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టాడు. [PE][PS]యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రత్యర్ధి బాణం విసరడానికి తన చెయ్యి చాపినట్టు. [PE][PS]ఆయన నిలబడి ఉన్నాడు. చూపుకు శ్రేష్ఠమైన ప్రజలందరినీ ఆయన హతం చేశాడు. [PE][PS]సీయోను కుమార్తె గుడారంలో తన ఆగ్రహాన్ని అగ్ని వర్షంలా కుమ్మరించాడు. [PE]
6. [PS]ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. [PE][PS]దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. [PE][PS]దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. [PE][PS]యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు. [PE]
7. [PS]ఒక తోట మీద దాడి చేసినట్టు ఆయన తన గుడారం మీద దాడి చేశాడు. [PE][PS]సమాజ పవిత్ర ప్రాంగణాన్ని నాశనం చేశాడు. [PE][PS]ఆరాధన సమావేశం, విశ్రాంతి దినం సీయోనులో మరుపుకు వచ్చేలా యెహోవా చేశాడు. [PE][PS]కోపావేశంలో ఆయన రాజూ యాజకుడూ ఇద్దరినీ తోసిపుచ్చాడు. [PE]
8. [PS]ప్రభువు తన బలిపీఠం తోసిపుచ్చాడు. [PE][PS]తన పవిత్ర ప్రాంగణం నిరాకరించాడు. [PE][PS]దాని కోట గోడలను శత్రువుల చేతికి అప్పగించాడు. [PE][PS]ఏర్పరచిన రోజు సమాజ ప్రాంగణంలో వినిపించే ధ్వనిలా వాళ్ళు యెహోవా మందిరంలో ఉత్సాహ ధ్వని చేశారు. [PE]
9. [PS]సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. [PE][PS]చెయ్యి చాపి కొలత గీత గీశాడు. [PE][PS]గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. [PE][PS]ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు. [PE]
10. [PS]యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. [PE][PS]దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. [PE][PS]దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. [PE][PS]అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు. [PE]
11. [PS]సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. [PE][PS]వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. [PE][PS]యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు. [PE]
12. [PS]నా కన్నీళ్లు ఎండిపోయాయి. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. [PE][PS]నా అంతరంగం కలవరంతో ఉంది. [PE][PS]నా ప్రజల కుమారి అణిచివేత కారణంగా నా పేగులు నేల మీద ఒలికి పోయాయి. [PE][PS]పిల్లలు, పాలు తాగే చంటిబిడ్డలు నిస్సహాయంగా గ్రామ వీధుల్లో నీరసంగా పడి ఉన్నారు. [PE]
13. [PS]పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. [PE][PS]“ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు. [PE]
14. [PS]యెరూషలేము కుమారీ, నీ గురించి నేనేమనాలి? నిన్ను దేనితో పోల్చి ఆదరించాలి? [PE][PS]సీయోను కుమారీ, కన్యకా, నీ పతనం సముద్రమంత విస్తారమైనది. [PE][PS]నిన్ను స్వస్థపరచగల వాడెవడు? [PE]
15. [PS]నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. [PE][PS]నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. [PE][PS]వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు. [PE]
16. [PS]దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. [PE][PS]వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. [PE][PS]“పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు. [PE]
17. [PS]నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! [PE][PS]అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు. [PE]
18. [PS]తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. [PE][PS]తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. [PE][PS]నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. [PE][PS]నీ విరోధుల బలం హెచ్చించాడు. [PE]
19. [PS]ప్రజల హృదయం యెహోవాకు కేకలు పెడుతూ. [PE][PS]“సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహంలా పగలూ రాత్రి నీ కన్నీరు కారనివ్వు. [PE][PS]జాప్యం జరగనివ్వకు. నీ కంటి నుంచి వెలువడే కన్నీటిధార ఆగనివ్వకు. [PE]
20. [PS]రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. [PE][PS]నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. [PE][PS]ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.” [PE]
21. [PS]యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. [PE][PS]తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? [PE][PS]యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా? [PE]
22. [PS]యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. [PE][PS]నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. [PE][PS]నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. [PE][PS]జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు. [PE][PS]ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం[* భయం శత్రువులను ] రప్పించావు. [PE][PS]యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. [PE][PS]నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు. [PE]