1. {#1విలాపం, నిరీక్షణ }
2. [PS]నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి. [PE]
3. [PS]ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు. [PE]
4. [PS]నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు. [PE]
5. [PS]ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు. [PE]
6. [PS]నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు. [PE]
7. [PS]ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు. [PE]
8. [PS]ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. [PE][PS]నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు. [PE]
9. [PS]నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు. [PE][PS]ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. [PE][PS]నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.
10. నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. [PE]
11. [PS]దాగి ఉన్న సింహంలా ఉన్నాడు. [PE]
12. [PS]నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు. [PE]
13. [PS]విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. [PE]
14. [PS]తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు. [PE]
15. [PS]నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. [PE][PS]ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు. [PE]
16. [PS]చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. [PE][PS]విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు. [PE]
17. [PS]రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు. [PE]
18. [PS]నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు. [PE]
19. [PS]కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను. [PE]
20. [PS]నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను. [PE]
21. [PS]కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను. [PE]
22. [PS]కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది. [PE]
23. [PS]యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు. [PE]
24. [PS]ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. [PE][PS]నీ నమ్మకత్వం ఎంతో గొప్పది! [PE]
25. [PS]“యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. [PE][PS]కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను. [PE]
26. [PS]తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు. [PE]
27. [PS]యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది. [PE]
28. [PS]తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది. [PE]
29. [PS]అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి. [PE]
30. [PS]ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి. [PE]
31. [PS]అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. [PE][PS]అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి. [PE]
32. [PS]ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు. [PE]
33. [PS]ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు. [PE]
34. [PS]హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. [PE]
35. [PS]దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం, [PE]
36. [PS]మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం, [PE]
37. [PS]ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా? [PE]
38. [PS]ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు? [PE]
39. [PS]మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా? [PE]
40. [PS]బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు? [PE]
41. [PS]మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం. [PE]
42. [PS]ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం. [PE]
43. [PS]మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు. [PE]
44. [PS]నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు. [PE]
45. [PS]మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు. [PE]
46. [PS]జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు. [PE]
47. [PS]మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు. [PE]
48. [PS]గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి. [PE]
49. [PS]నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది. [PE]
50. [PS]యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ, [PE]
51. [PS]నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది. [PE]
52. [PS]నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది. [PE]
53. [PS]ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు. [PE]
54. [PS]వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు. [PE]
55. [PS]నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను. [PE]
56. [PS]యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను. [PE]
57. [PS]సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు. [PE]
58. [PS]నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు. [PE]
59. [PS]ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు. [PE]
60. [PS]యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు. [PE]
61. [PS]నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు. [PE]
62. [PS]యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు. [PE]
63. [PS]నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు. [PE]
64. [PS]యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి. [PE]
65. [PS]యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు. [PE]
66. [PS]వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు. [PE][PS]యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు. [PE]