1. {#1వితంతువు వేసిన కానుక. దేవునికి ఇవ్వడం గురించి యేసు అభిప్రాయం [BR]మార్కు 12:41, 44 } [PS]హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు.
2. ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు.
3. అప్పుడాయన [SCJ]“ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను.[SCJ.]
4. [SCJ]వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది”[SCJ.] అని వారితో చెప్పాడు. [PE]
5. {#1ఒలీవ కొండ ప్రసంగం [BR]మత్తయి 24-25; మార్కు 13 } [PS]దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
6. అప్పుడు ఆయన, [SCJ]“ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది”[SCJ.] అన్నాడు.
7. అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు. [PE]
8. {#1భావి మానవ చరిత్ర [BR]మత్తయి 24:3-14 } [PS]ఆయన, [SCJ]“మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. చాలా మంది నా పేర వచ్చి, ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. మీరు వారిని అనుసరించవద్దు.[SCJ.]
9. [SCJ]మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు”[SCJ.] అన్నాడు.
10. ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, [SCJ]“ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది.[SCJ.]
11. [SCJ]కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి.[SCJ.] [PE]
12. [PS] [SCJ]ఇవన్నీ జరగడానికి ముందు వారు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు.[SCJ.]
13. [SCJ]దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది.[SCJ.]
14. [SCJ]కనుక మేము ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసులో నిశ్చయం చేసుకోండి.[SCJ.]
15. [SCJ]మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటలనూ మీకిస్తాను.[SCJ.]
16. [SCJ]తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వారు మీలో కొంతమందిని చంపిస్తారు.[SCJ.]
17. [SCJ]నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.[SCJ.]
18. [SCJ]కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.[SCJ.]
19. [SCJ]మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.[SCJ.] [PE]
20. {#1యెరూషలేము వినాశనం } [PS] [SCJ]యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.[SCJ.]
21. [SCJ]అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.[SCJ.]
22. [SCJ]ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.[SCJ.]
23. [SCJ]ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.[SCJ.]
24. [SCJ]వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.[SCJ.] [PE]
25. {#1మహా తేజస్సులో ప్రభువు రాక [BR]మత్తయి 24:29-31 } [PS] [SCJ]“ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు.[SCJ.]
26. [SCJ]ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు.[SCJ.]
27. [SCJ]అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు.[SCJ.]
28. [SCJ]ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.[SCJ.] [PE]
29. {#1అంజూరు చెట్టు ఉపమానం [BR]మత్తయి 24:32, 33; మార్కు 13:28, 29 } [PS]తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. [SCJ]“అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి.[SCJ.]
30. [SCJ]అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా![SCJ.]
31. [SCJ]అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.[SCJ.]
32. [SCJ]ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు కచ్చితంగా చెబుతున్నాను.[SCJ.]
33. [SCJ]ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.[SCJ.] [PE]
34. {#1ప్రభువు రాక, హెచ్చరికలు [BR]మత్తయి 24:34-51; మార్కు 13:30-37 } [PS] [SCJ]“తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.[SCJ.]
35. [SCJ]ఆ రోజు లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది.[SCJ.]
36. [SCJ]కాబట్టి జరగబోయే వీటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్య కుమారుడి ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండడానికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి”[SCJ.] అని చెప్పాడు. [PE]
37. [PS]ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.
38. ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు. [PE]