1. {#1ధనికుల దుర్మార్గాలు } [PS]మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ [PE][QS]దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. [QE][QS]వాళ్లకు అధికారముంది [QE][QS]కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు. [QE]
2. [QS]వాళ్ళు పొలాలు ఆశించి లాగేసుకుంటారు. [QE][QS]ఇళ్ళు ఆశించి తీసేసుకుంటారు. [QE][QS]వ్యక్తినీ అతని ఇంటినీ, [QE][QS]వ్యక్తినీ అతని వారసత్వాన్నీ వాళ్ళు అణిచేసి ఆక్రమించుకుంటారు. [QE]
3. [PS]కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, [PE][QS]“ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను. [QE][QS]దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు. [QE][QS]గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది. [QE]
4. [QS]ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు. [QE][QS]ఎంతో దుఃఖంతో ఏడుస్తారు. [QE][QS]వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం. [QE][QS]యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు. [QE][QS]ఆయన నా దగ్గర నుంచి దాన్ని ఎలా తీసేస్తాడు? [QE][QS]ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు.” [QE]
5. [QS]అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు [QE][QS]భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో వారసులెవరూ ఉండరు. [QE]
6. {#1అబద్ద ప్రవక్తలు } [PS]“ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు. [PE][QS]అవమానం రాకూడదు” అని వారంటారు. [QE]
7. [QS]“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా? [QE][QS]ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?” [QE][QS]అని చెప్పడం భావ్యమేనా? [QE][QS]యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా! [QE]
8. [QS]ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. [QE][QS]యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా, [QE][QS]నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు. [QE]
9. [PS]వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు. [PE][QS]వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండాా చేస్తున్నారు. [QE]
10. [QS]లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి [QE][QS]మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు. [QE][QS]నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. [QE]
11. [QS]పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి, [QE][QS]“ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే, [QE][QS]వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు. [QE]
12. {#1విమోచన వాగ్దానం } [PS]యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను. [PE][QS]ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను. [QE][QS]గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను. [QE][QS]తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను. [QE][QS]చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది. [QE]
13. [QS]వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు. [QE][QS]వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. [QE][QS]వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు. [QE][QS]యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు. [QE]