1. {#1నాయకులు, ప్రవక్తలు } [PS]నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, [PE][QS]ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. [QE][QS]న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా? [QE]
2. [QS]మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. [QE][QS]నా ప్రజల చర్మం ఒలిచేసి [QE][QS]వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు. [QE]
3. [QS]నా ప్రజల మాంసాన్ని తింటారు. [QE][QS]వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. [QE][QS]ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా [QE][QS]ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని [QE][QS]ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు. [QE]
4. [PS]ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు [PE][QS]కానీ ఆయన వారికి జవాబివ్వడు. [QE][QS]మీరు చెడు పనులు చేశారు. [QE][QS]కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.” [QE]
5. [PS]నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, [PE][QS]తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. [QE][QS]భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. [QE]
6. [QS]అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. [QE][QS]సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. [QE][QS]ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. [QE][QS]పగలు చీకటిగా మారిపోతుంది. [QE]
7. [QS]అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది. [QE][QS]సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు. [QE][QS]నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు. [QE]
8. [PS]అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ [PE][QS]ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి [QE][QS]యెహోవా ఆత్మమూలంగా [QE][QS]సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను. [QE]
9. [PS]యాకోబు వంశపు ప్రధానులారా, [PE][QS]ఇశ్రాయేలీయుల అధిపతులారా, [QE][QS]ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ [QE][QS]సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు. [QE]
10. [QS]సీయోనును మీరు రక్తంతో కడతారు. [QE][QS]దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. [QE]
11. [QS]ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. [QE][QS]వారి యాజకులు కూలికి బోధిస్తారు. [QE][QS]ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. [QE][QS]అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని [QE][QS]“యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, [QE][QS]ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు. [QE]
12. [PS]కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు. [PE][QS]యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. [QE][QS]మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది. [QE]