1. {#1యెహోవా మందిర పర్వతం [BR]4:1-3; యెష 2:1-4 } [PS]తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం [PE][QS]పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. [QE][QS]కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. [QE][QS]ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు. [QE]
2. [QS]అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, [QE][QS]“యాకోబు దేవుని మందిరానికి, [QE][QS]యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. [QE][QS]ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. [QE][QS]మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” [QE][QS]సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, [QE][QS]యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి. [QE]
3. [QS]ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. [QE][QS]దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. [QE][QS]వారు తమ కత్తులను నాగటి నక్కులుగా [QE][QS]తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. [QE][QS]రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. [QE][QS]యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు. [QE]
4. [PS]దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా [PE][QS]తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. [QE][QS]ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట. [QE]
5. [QS]ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు. [QE][QS]మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి [QE][QS]ఎప్పటికీ నడుచుకుంటాము. [QE]
6. {#1యెహోవా ప్రణాళిక } [PS]యెహోవా ఇలా చెబుతున్నాడు, [PE][QS]ఆ రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను. [QE][QS]అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరికి చేరుస్తాను. [QE]
7. [QS]కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని [QE][QS]బలమైన ప్రజగా చేస్తాను. [QE][QS]యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి [QE][QS]ఎప్పటికీ వారిని పాలిస్తాను. [QE]
8. [QS]మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు [QE][QS]పూర్వపు అధికారం వస్తుంది. [QE][QS]యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది. [QE]
9. [PS]మీరెందుకు కేకలు వేస్తున్నారు? [PE][QS]మీకు రాజు లేడా? [QE][QS]మీ సలహాదారులు నాశనమయ్యారా? [QE][QS]అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా మీరు బాధపడుతున్నారా? [QE]
10. [QS]సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా [QE][QS]నొప్పులు పడుతూ కను. [QE][QS]ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి. [QE][QS]బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది. [QE][QS]అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. [QE]
11. [PS]అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి, [PE][QS]“సీయోను అపవిత్రం అవుతుంది గాక! [QE][QS]దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు. [QE]
12. [QS]ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు. [QE][QS]ఆయన ఆలోచన అర్థం కాదు. [QE][QS]కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు. [QE]
13. [PS]యెహోవా ఇలా అంటున్నాడు, [PE][QS]“సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు. [QE][QS]మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను. [QE][QS]నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు. [QE][QS]వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను. [QE][QS]వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.” [QE]