1. {#1బేత్లెహేముకు రాబోయే పాలకుడు } [PS]యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. [PE][QS]నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. [QE][QS]అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు. [QE]
2. [QS]బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు. [QE]
3. [QS]కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు. [QE][QS]అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు. [QE]
4. [PS]ఆయన యెహోవా బలంతో [PE][QS]తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో [QE][QS]నిలబడి తన మంద మేపుతాడు. [QE][QS]వాళ్ళు క్షేమంగా ఉంటారు. [QE][QS]భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. [QE]
5. {#1విధ్వంసం, విమోచన } [QS]అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, [QE][QS]వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు [QE][QS]వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, [QE][QS]ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. [QE][QS]ఆయనే మనకు శాంతి. [QE]
6. [PS]వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు. [PE][QS]తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. [QE][QS]అష్షూరీయులు మన దేశంలో చొరబడి [QE][QS]మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు [QE][QS]ఆయన మనలను ఇలా కాపాడతాడు. [QE]
7. [QS]యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, [QE][QS]యెహోవా కురిపించే మంచులాగా, [QE][QS]మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, [QE][QS]గడ్డి మీద పడే వానలాగా ఉంటారు. [QE]
8. [PS]యాకోబు సంతానంలో మిగిలినవారు [PE][QS]రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య [QE][QS]అడవి జంతువుల్లోని సింహం లాగా, [QE][QS]గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. [QE][QS]అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది. [QE]
9. [QS]నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది. [QE][QS]అది వారిని నిర్మూలం చేస్తుంది. [QE]
10. [PS]యెహోవా ఇలా చెబుతున్నాడు, [PE][QS]“ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. [QE][QS]నీ రథాలను ధ్వంసం చేస్తాను. [QE]
11. [QS]నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. [QE][QS]నీ కోటలన్నిటినీ పడగొడతాను. [QE]
12. [PS]మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. [PE][QS]జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు. [QE]
13. [QS]చెక్కిన విగ్రహాలూ [QE][QS]దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను. [QE][QS]అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు. [QE]
14. [QS]మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. [QE][QS]నీ పట్టణాలను పడగొడతాను. [QE]
15. [QS]నేను మహా కోపంతో ఉగ్రతతో [QE][QS]నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.” [QE]