1. {#1దేవుని ఫిర్యాదు } [PS]యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. [PE][QS]మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, [QE][QS]లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. [QE][QS]నీ స్వరం కొండలు వినాలి. [QE]
2. [QS]పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు [QE][QS]యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. [QE][QS]ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు. [QE]
3. [PS]నా ప్రజలారా, నేను మీకేం చేశాను? [PE][QS]మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి. [QE]
4. [QS]ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. [QE][QS]బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. [QE][QS]మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను. [QE]
5. [PS]నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, [PE][QS]బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. [QE][QS]యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా [QE][QS]షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి. [QE]
6. [PS]యెహోవాకు నేనేం తీసుకురాను? [PE][QS]మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను? [QE][QS]దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా? [QE]
7. [QS]వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా? [QE][QS]నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా? [QE][QS]నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా? [QE]
8. [QS]మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. [QE][QS]ఆయన నిన్ను కోరేదేంటంటే, [QE][QS]న్యాయంగా ప్రవర్తించు. [QE][QS]కనికరాన్ని ప్రేమించు. [QE][QS]వినయంగా నీ దేవునితో నడువు. [QE]
9. {#1ఇశ్రాయేలీయుల దుర్నీతి క్రియలు } [PS]వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, [PE][QS]ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది. [QE][QS]“బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి. [QE]
10. [QS]దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. [QE][QS]అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి. [QE]
11.
12. [PS]తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా? [PE][QS]ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. [QE][QS]అక్కడి ప్రజలు అబద్దికులు. [QE][QS]వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది. [QE]
13. [PS]కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను. [PE][QS]నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను. [QE]
14. [QS]నువ్వు తింటావు కానీ తృప్తి పడవు. [QE][QS]నీలోపల వెలితిగానే ఉంటుంది. [QE][QS]నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు. [QE][QS]నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను. [QE]
15. [QS]నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. [QE][QS]నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు [QE][QS]కానీ ఆ నూనె పూసుకోవు. [QE][QS]ద్రాక్షపళ్ళను తొక్కుతావు [QE][QS]కానీ ద్రాక్షారసం తాగవు. [QE]
16. [PS]ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు. [PE][QS]అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు. [QE][QS]వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు. [QE][QS]కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను. [QE][QS]దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను. [QE][QS]నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.” [QE]