1. {#1ఇశ్రాయేలు కష్టాలు } [PS]నాకెంతో బాధగా ఉంది! [PE][QS]వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, [QE][QS]ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. [QE][QS]పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. [QE][QS]అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను. [QE]
2. [QS]భక్తులు దేశంలో లేకుండా పోయారు. [QE][QS]ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. [QE][QS]హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. [QE][QS]ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు. [QE]
3. [PS]వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. [PE][QS]అధికారి డబ్బులు అడుగుతాడు. [QE][QS]న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. [QE][QS]గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. [QE][QS]ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు. [QE]
4. [QS]వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. [QE][QS]వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. [QE][QS]అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, [QE][QS]మీరు శిక్ష అనుభవించే రోజు. [QE][QS]ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది. [QE]
5. [PS]ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు. [PE][QS]ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు. [QE][QS]నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు. [QE]
6. [QS]కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు. [QE][QS]కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు. [QE][QS]తన సొంత ఇంటివారే తన శత్రువులు. [QE]
7. [PS]అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. [PE][QS]రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. [QE][QS]నా దేవుడు నా మాట వింటాడు. [QE]
8. {#1ఇశ్రాయేలు తిరిగి లేవడం } [QS]నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. [QE][QS]నేను కింద పడినా తిరిగి లేస్తాను. [QE][QS]నేను చీకట్లో కూర్చున్నపుడు [QE][QS]యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. [QE]
9. [PS]నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, [PE][QS]కాబట్టి ఆయన నా పక్షాన వాదించి [QE][QS]నా పక్షాన న్యాయం తీర్చే వరకూ [QE][QS]నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. [QE][QS]ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. [QE][QS]ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను. [QE]
10. [PS]నా శత్రువు దాన్ని చూస్తాడు. [PE][QS]“నీ యెహోవా దేవుడు ఎక్కడ?” [QE][QS]అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. [QE][QS]నా కళ్ళు ఆమెను చూస్తాయి. [QE][QS]వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు. [QE]
11. [PS]నీ గోడలు కట్టించే రోజు వస్తుంది. [PE][QS]ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి. [QE]
12. [QS]ఆ రోజు అష్షూరు దేశం నుంచి, [QE][QS]ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి, [QE][QS]ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ [QE][QS]ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు [QE][QS]నీ దగ్గరికి వస్తారు. [QE]
13. [QS]ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, [QE][QS]వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి. [QE]
14. {#1దేవుని క్షమాపణ, ఆయన కనికరం } [PS]నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. [PE][QS]కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా [QE][QS]పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు. [QE]
15. [QS]ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా [QE][QS]నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను. [QE]
16. [PS]రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. [PE][QS]వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు. [QE][QS]వాళ్ళ చెవులు వినబడవు. [QE]
17. [PS]పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. [PE][QS]వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. [QE][QS]భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. [QE][QS]నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు. [QE]
18. [PS]నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. [PE][QS]నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. [QE][QS]నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. [QE][QS]నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు. [QE]
19. [PS]నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు. [PE][QS]నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. [QE][QS]మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు. [QE]
20. [QS]నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. [QE][QS]పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.[QE]