1. ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు ఇంతకు ముందు లాగా శకునం చూడడానికి వెళ్ళకుండా ఎడారి వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. PEPS
|
2. బిలాము కళ్ళెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం శిబిరంలో ఉండడం చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు.
|
3. అతడు ఇలా ప్రవచించాడు. PEPS “బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు. PEPS కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు.
|
4. అతడు దేవుని మాటలు మాట్లాడతాడు,
దేవుని మాటలు వింటాడు. అతడు సర్వశక్తుని దగ్గర నుంచి వచ్చే దర్శనం చూస్తాడు, ఆయన ఎదుట అతడు తన కళ్ళు తెరిచి వంగి నమస్కరిస్తాడు. PEPS |
5. యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి. PEPS ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి! PEPS
|
6. అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా, యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి. PEPS
|
7. అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. PEPS అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. PEPS వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. PEPS వారి రాజ్యం ఘనత పొందుతుంది. PEPS
|
8. దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. PEPS అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. PEPS అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. PEPS వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు. PEPS
|
9. అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు. PEPS అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు? PEPS అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక, అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక” అన్నాడు. PEPS
|
10. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద రగిలింది గనక అతడు తన చేతులు చరిచి బిలాముతో “నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను కాని నీవు ఈ మూడుసార్లు వారిని దీవించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ స్థలానికి తొందరగా వెళ్లు.
|
11. నేను నిన్ను ఎంతో గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాను గాని, నీకు అది దక్కకుండా యెహోవా నిన్ను ఆటంకపరిచాడు” అన్నాడు. PEPS
|
12. అందుకు బిలాము బాలాకుతో “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను,
|
14. కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి” అన్నాడు. PS
|
15. {బిలాము నాలుగో సందేశం} PS బిలాము ప్రవచనం చెప్పాడు. “బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు, కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు. PEPS
|
16. ఇది దేవుని వాక్కులను విన్నవాడి ప్రవచనం. PEPS మహాన్నతుని జ్ఞానం తెలిసినవాడి ప్రవచనం. PEPS సర్వశక్తుని దర్శనాలు చూసినవాడి ప్రవచనం. PEPS ఆయన ఎదుట తెరిచిన కళ్ళతో అతడు వంగి నమస్కారం చేస్తున్నాడు. PEPS
|
17. నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. PEPS నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు. PEPS ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. PEPS రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది. PEPS అతడు మోయాబు * సరిహద్దులు. నాయకులను పడగొడతాడు. PEPS అతడు † అల్లరి రేకెత్తించే వారిని, సమస్యలు తెచ్చే వారిని. షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు. PEPS
|
18. ఎదోము, శేయీరు, ఇశ్రాయేలు శత్రువులు స్వాధీనం అవుతారు. PEPS వారిని ఇశ్రాయేలీయులు తమ బలం చేత జయిస్తారు. PS
|
19. {బిలాము చివరి సందేశం} PS యాకోబు సంతానంలోనుంచి రాజ్యాధికారం వస్తుంది. PEPS అతడు వారి పట్టణాల్లో మిగిలిన వారిని నాశనం చేస్తారు” అన్నాడు. PEPS
|
20. ఇంకా బిలాము అమాలేకీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం. కాని దాని అంతం నాశనమే” అన్నాడు. PEPS
|
21. తరువాత బిలాము కేనీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “నువ్వు నివాసం ఉన్న స్థలం బలమైనది. PEPS నీ గూడు బండరాళ్ళల్లో ఉంది. PEPS
|
24. కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి. PEPS అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి. PEPS కిత్తీయులు కూడా నాశనమౌతారు” అన్నాడు. PEPS
|