1. {రెండోసారి జనాభా లెక్కలు} PS ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,
|
2. “మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు. PEPS
|
3. కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,
|
4. “20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు. PEPS
|
9. కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే. PEPS
|
10. ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
|
12. షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
|
15. గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
|
20. యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
|
23. ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
|
29. మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు. PEPS
|
33. హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
|
35. ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
|
37. వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు. PEPS
|
40. షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
|
44. ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
|
54. ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.
|
55. చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.
|
57. వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.
|
58. లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.
|
59. కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది. PEPS
|
62. వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు. PEPS
|
63. యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.
|
64. మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు. PEPS
|
65. ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు. PE
|