పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
సామెతలు
1. నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు. [PE][PS]
2. నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. [PE][PS]
3. అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి. [PE][PS]
4. ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి. [PE][PS]
5. డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది. [PE][PS]
6. దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. [PE][PS]
7. ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. [PE][PS]
8. నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది. [PE][PS]
9. బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. [PE][PS]
10. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు. [PE][PS]
11. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు. [PE][PS]
12. ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. [PE][PS]
13. నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు. [PE][PS]
14. బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. [PE][PS]
15. కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. [PE][PS]
16. నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. [PE][PS]
17. పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. [PE][PS]
18. నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. [PE][PS]
19. కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. [PE][PS]
20. ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు. [PE][PS]
21. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది. [PE][PS]
22. నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. [PE][PS]
23. సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో. [PE][PS]
24. ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు. [PE][PS]
25. నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. [PE][PS]
26. కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. [PE][PS]
27. వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. [PE][PS]
28. దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది. [PE][PS]
29. ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు? [PE][PS]
30. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా. [PE][PS]
31. ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. [PE][PS]
32. అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. [PE][PS]
33. నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు. [PE][PS]
34. నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు. [PE][PS]
35. “నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు. [PE]

Notes

No Verse Added

Total 31 Chapters, Current Chapter 23 of Total Chapters 31
సామెతలు 23:10
1. నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు. PEPS
2. నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. PEPS
3. అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి. PEPS
4. ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి. PEPS
5. డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది. PEPS
6. దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. PEPS
7. ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. PEPS
8. నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది. PEPS
9. బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. PEPS
10. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు. PEPS
11. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు. PEPS
12. ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. PEPS
13. నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు. PEPS
14. బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. PEPS
15. కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. PEPS
16. నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. PEPS
17. పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. PEPS
18. నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. PEPS
19. కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. PEPS
20. ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు. PEPS
21. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది. PEPS
22. నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. PEPS
23. సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో. PEPS
24. ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు. PEPS
25. నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. PEPS
26. కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. PEPS
27. వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. PEPS
28. దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది. PEPS
29. ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు? PEPS
30. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా. PEPS
31. ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. PEPS
32. అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. PEPS
33. నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు. PEPS
34. నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు. PEPS
35. “నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు. PE
Total 31 Chapters, Current Chapter 23 of Total Chapters 31
×

Alert

×

telugu Letters Keypad References