1. [PS]*లలిత గీతం. దావీదు కీర్తన *[PE][QS]దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను. [QE]
2. [QS]స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను. [QE]
3. [QS]ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. [QE]
4. [QS]యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది. [QE]
5. [QS]దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో. [QE]
6. [QS]నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి. [QE]
7. [QS]తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను హర్షిస్తాను. షెకెమును పంచిపెడతాను. సుక్కోతు లోయను కొలిపిస్తాను. [QE]
8. [QS]గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం. [QE]
9. [QS]మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోముపైకి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియనుబట్టి జయోత్సవం చేశాను. [QE]
10. [QS]కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకుపోతారు? ఎదోములోకి నన్నెవరు నడిపిస్తారు? [QE]
11. [QS]దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా? [QE]
12. [QS]మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చెయ్యి. [QE]
13. [QS]దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే. [QE]