పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. [PS]*ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన *[PE][QS]నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు. [QE]
2. [QS]దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు. [QE]
3. [QS]నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు [QE]
4. [QS]నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను. [QE]
5. [QS]నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు. [QE]
6. [QS]ఇలాటి శత్రుమూకపై దుర్మార్గుడొకణ్ణి అధికారిగా నియమించు. నేరాలు మోపేవాడు వారి కుడివైపున నిలబడతాడు గాక. [QE]
7. [QS]వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చు గాక. వాడి ప్రార్థన పాపంగా ఎంచబడు గాక [QE]
8. [QS]వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక. [QE]
9. [QS]వాడి బిడ్డలు తండ్రిలేని వారౌతారు గాక. వాడి భార్య వితంతువు అగు గాక [QE]
10. [QS]వాడి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తు గాక. శిథిలమైపోయిన తమ ఇళ్ళకు దూరంగా సాయం కోసం అర్థిస్తారు గాక. [QE]
11. [QS]వాడి ఆస్తి అంతా అప్పులవాళ్ళు ఆక్రమించుకుంటారు గాక. వాడు సంపాదించినది పరులు దోచుకుంటారు గాక. [QE]
12. [QS]వాడిపై జాలిపడే వారు ఎవరూ లేకపోదురు గాక. వాడి అనాథ పిల్లల పై దయ చూపేవారు ఉండక పోదురు గాక. [QE]
13. [QS]వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక. [QE]
14. [QS]వాడి పితరుల దోషం యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక. వాడి తల్లి చేసిన పాపం మరుపుకు రాకుండు గాక. [QE]
15. [QS]యెహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపై నుండి కొట్టి వేస్తాడు గాక. వారి దోషం నిత్యం యెహోవా సన్నిధిని కనబడు గాక. [QE]
16. [QS]ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు. [QE]
17. [QS]శపించడం వాడికి మహా ఇష్టం. కాబట్టి అది వాడి మీదికే రావాలి. దీవెనను వాడు అసహ్యించుకున్నాడు. కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు. [QE]
18. [QS]ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది. [QE]
19. [QS]కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక. [QE]
20. [QS]నాపై నేరం మోపేవారికి, నా గురించి చెడుగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలిగే ప్రతీకారం అవుతుంది గాక. [QE]
21. [QS]యెహోవా ప్రభూ, నీ నామాన్నిబట్టి నా పట్ల దయ చూపు. నీ నిబంధన విశ్వసనీయత ఉదాత్తమైనది గనక నన్ను రక్షించు. [QE]
22. [QS]నేను పీడితుణ్ణి. అవసరంలో ఉన్నాను. నా హృదయం నాలో గాయపడి ఉంది. [QE]
23. [QS]సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను. మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు. [QE]
24. [QS]ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది. [QE]
25. [QS]నాపై నిందలు మోపే వారు నన్ను పిచ్చివాడన్నట్టు చూస్తున్నారు. వారు నన్ను చూసి తలాడిస్తున్నారు. [QE]
26. [QS]యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు. [QE]
27. [QS]ఇది నీ వల్లనే జరిగిందనీ, యెహోవావైన నీవే దీన్ని చేశావనీ వారికి తెలియాలి. [QE]
28. [QS]వారు నన్ను శపిస్తున్నారు గానీ దయచేసి నీవు నన్ను దీవించు. వారు నాపై దాడి చేస్తే వారికే అవమానం కలగాలి. నీ సేవకుడు మాత్రం సంతోషించాలి. [QE]
29. [QS]నా విరోధులు అవమానం ధరించుకుంటారు గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక. [QE]
30. [QS]సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను. [QE]
31. [QS]ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు. [QE]
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 109 / 150
1 ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన నేను ప్రస్తుతించే దేవా, మౌనంగా ఉండకు. 2 దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు. 3 నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు. అకారణంగా నాతో పోట్లాడుతున్నారు 4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు. అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను. 5 నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు. 6 ఇలాటి శత్రుమూకపై దుర్మార్గుడొకణ్ణి అధికారిగా నియమించు. నేరాలు మోపేవాడు వారి కుడివైపున నిలబడతాడు గాక. 7 వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చు గాక. వాడి ప్రార్థన పాపంగా ఎంచబడు గాక 8 వాడి బ్రతుకు దినాలు తరిగిపోవు గాక. వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక. 9 వాడి బిడ్డలు తండ్రిలేని వారౌతారు గాక. వాడి భార్య వితంతువు అగు గాక 10 వాడి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తు గాక. శిథిలమైపోయిన తమ ఇళ్ళకు దూరంగా సాయం కోసం అర్థిస్తారు గాక. 11 వాడి ఆస్తి అంతా అప్పులవాళ్ళు ఆక్రమించుకుంటారు గాక. వాడు సంపాదించినది పరులు దోచుకుంటారు గాక. 12 వాడిపై జాలిపడే వారు ఎవరూ లేకపోదురు గాక. వాడి అనాథ పిల్లల పై దయ చూపేవారు ఉండక పోదురు గాక. 13 వాడి వంశం నిర్మూలం అగు గాక. రాబోయే తరంలో వారి పేరు మాసిపోవు గాక. 14 వాడి పితరుల దోషం యెహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక. వాడి తల్లి చేసిన పాపం మరుపుకు రాకుండు గాక. 15 యెహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపై నుండి కొట్టి వేస్తాడు గాక. వారి దోషం నిత్యం యెహోవా సన్నిధిని కనబడు గాక. 16 ఎందుకంటే దయ చూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు. దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి, అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు. గుండె పగిలిన వాణ్ణి చంపాడు. 17 శపించడం వాడికి మహా ఇష్టం. కాబట్టి అది వాడి మీదికే రావాలి. దీవెనను వాడు అసహ్యించుకున్నాడు. కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు. 18 ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది. 19 కప్పుకోడానికి ధరించే వస్త్రం లాగా, తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి వదలకుండు గాక. 20 నాపై నేరం మోపేవారికి, నా గురించి చెడుగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలిగే ప్రతీకారం అవుతుంది గాక. 21 యెహోవా ప్రభూ, నీ నామాన్నిబట్టి నా పట్ల దయ చూపు. నీ నిబంధన విశ్వసనీయత ఉదాత్తమైనది గనక నన్ను రక్షించు. 22 నేను పీడితుణ్ణి. అవసరంలో ఉన్నాను. నా హృదయం నాలో గాయపడి ఉంది. 23 సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను. మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు. 24 ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమై పోయాయి. నా శరీరం ఎముకల గూడు అయిపోయింది. 25 నాపై నిందలు మోపే వారు నన్ను పిచ్చివాడన్నట్టు చూస్తున్నారు. వారు నన్ను చూసి తలాడిస్తున్నారు. 26 యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు. 27 ఇది నీ వల్లనే జరిగిందనీ, యెహోవావైన నీవే దీన్ని చేశావనీ వారికి తెలియాలి. 28 వారు నన్ను శపిస్తున్నారు గానీ దయచేసి నీవు నన్ను దీవించు. వారు నాపై దాడి చేస్తే వారికే అవమానం కలగాలి. నీ సేవకుడు మాత్రం సంతోషించాలి. 29 నా విరోధులు అవమానం ధరించుకుంటారు గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక. 30 సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను. 31 ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 109 / 150
×

Alert

×

Telugu Letters Keypad References