1. [PS]*దావీదు కీర్తన *[PE][QS]మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నిబంధన విశ్వాస్యత, అధారపడ దగిన నీ గుణాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగు గాక. [QE]
2. [QS]వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు? [QE]
3. [QS]మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు [QE]
4. [QS]వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. [QE]
5. [QS]వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు. [QE]
6. [QS]చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు. [QE]
7. [QS]చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు. [QE]
8. [QS]వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే. [QE]
9. [QS]ఇశ్రాయేలీయులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి కవచం. [QE]
10. [QS]అహరోను వంశస్థులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారి కవచం. [QE]
11. [QS]యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు. [QE]
12. [QS]యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు. [QE]
13. [QS]పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. [QE]
14. [QS]యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. [QE]
15. [QS]భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు. [QE]
16. [QS]ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు. [QE]
17. [QS]మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు. [QE]
18. [QS]మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి. [QE]