1. పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. [QBR]
2. యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి. [QBR]
3. యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు. [QBR]
4. యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది. [QBR]
5. నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు. [QBR]
6. యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు. [QBR]
7. నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి. [QBR]
8. మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను. [QBR]
9. మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను. [PE]