2. ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?
|
3. యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.
|
4. నేను అతన్ని ఓడించాను, అని చెప్పే అవకాశం నా శత్రువుకు ఇవ్వకు. నా ప్రత్యర్ధి మీద నేను జయం పొందాను, అని నా శత్రువు అనకూడదు. అలా జరగకపోతే, నేను పడిపోయినప్పుడు నా శత్రువులు ఆనందిస్తారు.
|