పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం. [QBR]
2. అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం. [QBR]
3. మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు. [QBR]
4. మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం? [QBR]
5. యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక. [QBR]
6. నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక. [QBR]
7. యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా. [QBR]
8. నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు. [QBR]
9. నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 137 / 150
కీర్తనల గ్రంథము 137:84
1 మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం. 2 అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం. 3 మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు. 4 మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం? 5 యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక. 6 నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక. 7 యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా. 8 నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు. 9 నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 137 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References