1. యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు అంగీకరించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు జవాబివ్వు.
|
3. నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు. నన్ను నేలకేసి తొక్కిపెట్టాడు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళతో బాటు నన్ను కూడా పాతాళంలో ఉండిపోయేలా చేయాలని చూస్తున్నాడు.
|
5. పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను. నీ పనులన్నీ మననం చేసుకుంటున్నాను. నువ్వు సాధించిన వాటిని తలపోసుకుంటున్నాను.
|
6. నీ వైపు నా చేతులు ఆశగా చాపుతున్నాను. ఎండి నెర్రెలు విచ్చిన నేలలాగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతూ ఉంది. సెలా.
|
7. యెహోవా, నా ఆత్మ సోలిపోయింది. త్వరగా నాకు జవాబియ్యి. నీ ముఖం దాచుకోవద్దు. అలా చేస్తే నేను సమాధిలోకి దిగిపోయినవాడిలాగా అవుతాను.
|
8. నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.
|
10. నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
|
12. నేను నీ సేవకుణ్ణి. నీ నిబంధన విశ్వసనీయతను బట్టి నా విరోధులను లేకుండా చెయ్యి. నా శత్రువులందరినీ నాశనం చెయ్యి. PE
|