1. ఇది నా నిర్ణయం, నా నాలుకతో పాపం చేయకుండా ఉండటానికి నా మాటలను జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గుడి దగ్గర నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.
|
3. నా గుండె నాలో రగులుతూ ఉంది. ఈ విషయాలను గూర్చి నేను ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా అగ్నిలా మండుతున్నది. చివరకు నేను ఇలా అన్నాను.
|
4. యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.
|
5. ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. సెలా.
|
6. నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.
|
11. పాపం కారణంగా నువ్వు మనుషులను శిక్షించినప్పుడు చెద పురుగులా వారి శక్తిని నువ్వు హరిస్తావు. నిశ్చయంగా మనుషులందరూ ఆవిరిలాంటి వాళ్ళు. సెలా.
|
12. యెహోవా, నా ప్రార్థన విను. నేను చెప్పేది విను. నా రోదనను పట్టించుకో. చెవిటివాడిలాగా ఉండకు. నీ ఎదుట నేను పరదేశిలా ఉన్నాను. నా పూర్వీకులందరిలాగ శరణార్ధిలాగా ఉన్నాను.
|